Templates by BIGtheme NET
Home >> Cinema News >> కుర్ర హీరోని తొక్కేస్తూ నిర్మాత డబుల్ గేమ్

కుర్ర హీరోని తొక్కేస్తూ నిర్మాత డబుల్ గేమ్


ప్రస్తుతం టాలీవుడ్ కి ఊపిరాడనివ్వని వింతైన పరిస్థితి కనిపిస్తోంది. మహమ్మారీ పుణ్యమా అని సినిమాలేవీ రిలీజ్ చేయలేని దుస్థితి. థియేటర్లు తెరవలేరు. రావాల్సిన సినిమాలు రావు. అలా ఇప్పటికే డజనున్నర పైగా సినిమాలు పోగు పడ్డాయి. ఒకవేళ థియేటర్లు తెరిస్తే.. వీటిలో వేటిని ముందుగా వదలాలి. వేటిని వెనక్కి ఆపాలి? అన్నదానిపై ఎవరికీ ఏ క్లారిటీ లేదు. అయితే ఓ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు మాత్రం కుర్ర హీరో సినిమాల్ని తొక్కిపట్టి అగ్ర హీరోల సినిమాల్ని రేసులో ముందుకు తీసుకొస్తున్నాడట. క్రైసిస్ తర్వాత జనాల్ని థియేటర్లకు రప్పించాలంటే ఇంతకంటే వేరొక మార్గం ఏదీ లేదని భావిస్తున్నారట.

ఆయన గేమ్ ఏదైనా కానీ తమ సినిమాని సేఫ్ గా రిలీజ్ చేసి లాభాలార్జించాలని.. తమకు మంచి పేరు రావాలన్నది సదరు కుర్ర హీరోల ఆలోచన. కానీ అది సవ్యంగా జరుగుతుందా? అంటే కరోనా కల్లోలంలో ఏదీ అర్థం కాని సన్నివేశమే కనిపిస్తోంది. దేనిపైనా ఇంకా స్పష్ఠత రాలేదు. అంతకంతకు సీన్ అల్లకల్లోలంగా మారుతోందే కానీ విరుగుడు కనిపించడం లేదు.

ఇప్పటికిప్పుడు సన్నివేశం కరెక్షన్ కి వచ్చినా తన సినిమా సంగతేంటో తేలక కన్ఫ్యూజన్ లో ఉన్నారట ఆ యువహీరోలు. థియేటర్స్ తెరిచాక జనాలను రప్పించే సత్తా కేవలం ఇండస్ట్రీ లో పెద్ద హీరోలకే ఉందని ఆ నిర్మాత చెబుతున్నాడట. ప్రస్తుతానికి అగ్ర హీరోల సినిమాల్నే ముందుగా రిలీజ్ చేసి జనాల్ని థియేటర్లకు రప్పించే ప్లాన్ చేస్తున్నాడట. ఇండస్ట్రీలో ఆ ఐదారుగురు హీరోలు ముందుగా వస్తేనే థియేటర్లకు మేలు జరుగుతుందని బలంగా చెబుతున్నాడట. వాళ్లవి ఆడితేనే.. మీ బ్యాచ్ హీరోల సినిమాలు థియేటర్స్ లో మళ్ళీ బాగా ఆడతాయని.. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ముందుగా సూపర్ స్టార్ సినిమాలు వేయాలని ఆ అగ్ర నిర్మాత కుర్ర హీరోలకు చెప్పాడట. దీనికి చేసేదేమీ లేక ఆ కుర్ర హీరోల నుంచి ఎలాంటి కౌంటర్ పడలేదని తెల్సింది..! అయినా అగ్ర హీరోల కోసం కుర్రహీరోల్ని ఇలా తొక్కేస్తే ఎలా? అంటూ జనం నుంచి కౌంటర్ పడుతోంది.