Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ పొడుగుకాళ్ల సోయగానికి కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే..!

ఈ పొడుగుకాళ్ల సోయగానికి కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే..!


‘ఆహా కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఢిల్లీ భామ వాణి కపూర్. మొదటి సినిమాతోనే అమ్మడికి చేదు అనుభవం ఎదురైంది. ఆహా కళ్యాణం కాస్త అట్టర్ ప్లాపుగా నిలిచింది. ఇక మొదటి సినిమానే తెలుగులో తన చివరి సినిమా అయింది. ఈ అందమైన పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పటికి వెండితెర పై తన సత్తా చాటలేక పోతుంది. అలాగని నిరుత్సాహపడి సినిమాలు చేయకుండా ఉండటం లేదు. అడపాదడపా హిందీ సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవలే హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్’ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుంది వాణి. అయితే సినిమాలంటే ఎంతో మక్కువ ఉన్న ఈ భామ మొదట్లో కాస్టింగ్ కౌచ్ భయంతో సినిమాల్లోకి రావడానికి భయపడిందట. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వాణి.. తన పర్సనల్ విషయాలతో పాటు కొత్త ఫోటోషూట్ లను అభిమానులతో పంచుకుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన వాణి మంచి ఫుడ్ లవర్. సినిమాలంటే చాలా ఇష్టం.

చిన్నప్పటి నుండే కొత్త పాత హిట్ ప్లాప్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చూసేదట. ఇక వాణి వాళ్ళకి ఓ ఫామ్హౌస్ ఉంది. అందులో ఎన్నో జంతువులు ఉండి అదొక మినీ జూ లాగే కనిపించేదట. ఈ అమ్మడికి కుక్కపిల్లలంటే చచ్చేంత ఇష్టమట. ఒక్కోసారి వీధి కుక్కలను కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా స్నానం చేయించేదట. వాణి వాళ్ల ఇంట్లో అంతా మిలట్రీ డిసిప్లేన్. ఆ డిసిప్లేన్ భరించలేక ఒక్కోసారి ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరిపోవాలనిపించేదని అంటుంది ఈ సొగసరి. ఢిల్లీలోనే టూరిజం స్టడీస్ కంప్లీట్ చేసి.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగులో అడుగు పెట్టింది. అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఎంతో గ్లామర్ గా కనిపిస్తుంది భామ. స్కర్టులో అలా కూర్చొని పోజిచ్చింది. అలా జారుతున్న కొంగును పట్టుకున్నట్లుగా డ్రెస్సును పట్టుకుని కొంటె లుక్ ఇచ్చింది. అంతే కుర్రాళ్ళు ఫ్లాట్ అయి ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.