Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> అంగ స్తంభనకు మునగ కాయ, బెరడు మంచివా? పువ్వులా?

అంగ స్తంభనకు మునగ కాయ, బెరడు మంచివా? పువ్వులా?


మునగ కాడలు తింటే.. ‘ఓలమ్మీ తిమ్మిరి ఎక్కిందో ఎక్కడో.. ’’ అంటూ పాటలు పాడేయటమే కాదు. శృంగార రాజ్యంలో అలుపెరుగని విక్రమార్కుడిలా రెచ్చిపోతారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే.. మునగలో ఉండే సుగుణాలు అలాంటివి. ఇప్పటికీ మన ఇండియాలో వయాగ్రా అమ్మకాలు తక్కువగా ఉండటానికి కారణం మునగేనట. మునగలో కేవలం కాయ మాత్రమే తింటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ, మునగ చెట్టులో ప్రతి ఒక్కటీ దివ్యౌషదమే. మునగ ఆకు, బెరడు, పువ్వు.. ఇలా కాదేదీ శృంగార సామర్థ్యాన్ని అనర్హం. అయితే, చాలామంది.. అంగస్తంభన కోసం మునక కాడ (కాయ) తినాలా? బెరడ తినాలా? పువ్వు ఎక్కువ పవర్‌ఫుల్లా అనే సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలకు చెక్ చెప్పేందుకే ఈ కథనం.

చాలామంది మునగ తినేస్తే చాలు మనకు తిరుగు ఉండదని అనుకుంటారు. కానీ, దానికి సరైన డైట్ కూడా తోడవ్వాలి. రోజూ బాదం, పాలు, కోడిగుడ్డు, వెల్లులి, పాలకూర, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌గా తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఇక మునగలో ఏది మంచిదనే విషయానికి వస్తే..:
❂ మునగ అంగస్తంభన మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
❂ మునగ కాయల్లోనే కాకుండా మునగ పువ్వులు, బెరడు, వేరు లాంటి భాగాల్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
❂ జీవితంలో ఎదురయ్యే అనేక వ్యాధులను నిరోధించే శక్తి మునగకు ఉంది. వందల కొద్దీ శారీరక రుగ్మతలు మునగతో నయమవుతాయి. ❂ ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
❂ మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు కాల్షియం ఉంటుంది.
❂ సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
❂ అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మునగ చెట్టులోని ఎండిపోయిన బెరడు ఔషదంలా పనిచేస్తుంది.
❂ బెరడును ఆవుపాలలో మరగించి కషాయంలా చేసి ఎండబెట్టాలి. ఆ పొడిని కొద్దిగా మూడు పూటలా నెల రోజులు పాటు తీసుకుంటే వీర్యకణాల వృద్ధి జరిగి అంగస్తంభన సమస్య దూరమవుతుంది.
❂ ఒక వేళ సెక్స్ సామర్థ్యం తగ్గిందనిపిస్తే మునగ పూలను పాలలో వేసుకుని తాగాలి.
❂ మునగ పూల పాలను మహిళలు కూడా తీసుకోవచ్చు.
❂ మునక కాయ తాత్కాలిక వయాగ్రాగా పనిచేస్తే.. బెరడు ఒక ఔషదంలా పనిచేస్తుంది. కాబట్టి.. రెండిట్లో ఏది కావాలో అదే మీరు తీసుకోండి.
❂ మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంది.
❂ మునగ పువ్వుల రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే ఉబ్బసం, అజీర్తి తగ్గుముఖం పడుతుంది.
❂ మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసం కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
❂ ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ నిద్రపోయే ముందు తాగితే రేచీకటి సమస్య తగ్గుతుంది. ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.