గుడిలో శివదర్శనం అయ్యాక ఇలా చేయొద్దు

0Lord-Shiva-Mahadevశివారాధన అనేది ఓ గొప్ప మోక్ష మార్గం. అయితే శివుడి దర్శనం, దర్శనాంతరం కూడా కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. ముందు గుడిలో ఎలాంటి నియమాలని పాటించాలో చూద్దాం….స్నానం చేసి శుభ్రతమైన బట్టలు కట్టుకొని, విభూది పెట్టుకొని, వీలయితే రుద్రాక్ష మాల వేసుకొని వెళ్ళవలెను. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం మొదలైన వస్తువులు వారి వారి సౌకర్యాన్ని బట్టి తీసుకెళ్ళాలి.

గోపుర దర్శనం కాగానే రెండు చేతులు పెట్టి నమస్కరించవాలనే. మౌనం పాటించాలి. మనసులో పంచాక్షరిని జపిస్తూ వెళ్ళవలెను. వినాయకుడిని దర్శించి వినాయక సుత్తి చెప్పి గుంజీళ్ళు తీస్తూ నమస్కరించవలెను. బలిపీఠం, నందిల మధ్య నమస్కరించవలెను. లోపల మూలస్థానంలోని మూర్తికి నమస్కరించి చుట్టూ ఉన్న ఉత్సవ మూర్తులు, చండీశ్వరుడు, ఇతర సన్నిధులలో కూడా నమస్కరించవలెను.

విభూదిని రెండు చేతులతో భక్తితో తీసుకొని క్రింద చిందకుండా పెట్టుకోవలెను. అలయ ప్రాకారంలో మూడు సార్లు ప్రదక్షిణ చెయవలెను. బయటకు వచ్చి ధ్వజస్తంభం క్రింద సాష్టాంగ నమస్కారం చేయకూడదు.ఎందుకంటే ధ్వజస్తంభం మొదట దర్శనం చేసుకోవాలి కాని శివుడి దర్శనం తరువాత చేస్తే పుణ్య ఫలితం కోరిన కోర్కెలు నేరవేరవు కొంచెం సేపు కూర్చుని వారి వారి అలవాటు ప్రకారం జపధ్యానములు చేసుకొని అక్కడినుంచి బయలుదేరి శివచింతనలో ఇంటికి తిరిగి రావలెను.