తులసీ పూజావిధానము

0Tulasiకార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ సందర్భంగానే ఈ తులసీపూజను కూడా చేస్తారు. 

తులసీపూజా విధానం :

మొదటగా మన ఇంటిముందు నిర్మించుకున్న తులసీకోట ముందు అయితే పద్మాలు వేసి.. వాటిమీద దీపాలను వుంచాలి. అనంతరం తులసీదేవిని, శ్రీమహావిష్ణువును సమేతంగా పూజించుకోవాలి. 

అయిదు రకాల నైవేద్యాలను, పండ్లను, తాంబూలాలను సమర్పించుకోవాలి. ప్రదక్షిణ, నమస్కారాలతో కార్తీకశుద్ధ ఏకాదశివరకు పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. 

కార్తీకశుద్ధ ఏకాదశిరోజు ఉపవాసం వుండి, పూజలు నిర్వహించుకోవాలి. అనంతరం తులసీదేవిని, లక్ష్మీనారాయణలను అర్చించుకోవాలి. ఆరోజు రాత్రంతా జాగరణ చేయాలి. 

ద్వాదశిరోజు బియ్యపు పిండితో మూడు ముద్దలను తయారుచేసి.. వాటిని నివేదించాలి. ఒకటి తులసి దగ్గర, రెండవదాన్ని బ్రాహ్మణుడికి, మూడోదాన్ని రోటిలో వుంచి.. పాలుపోసి చెరుకుగడలతో దంచాలి. ఇలా చేయడంవల్ల మనం చేసిన పాపాలను నుంచి విముక్తి కలిగి, పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాంగళ్య వృద్ధి, సర్వసుఖాలు, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.