సిరి సంపదలు కలగాలని శ్రీమహాలక్ష్మి చెప్పిన 5 సూత్రాలు ఇవే !

0lakshmi deviశ్రీమహాలక్ష్మి ఈ లోకాలకే సర్వ మంగళి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దారిద్ర నాశిని, భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీమహాలక్ష్మి ని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువే వెంకటేశ్వరస్వామి అవతారం ఎత్తాడు. ఇంకా మనవ మాత్రులం ఎంత చెప్పండి. అయితే ఒకానొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోదిస్తూ, శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వారి కష్టాలకు శ్రీమహావిష్ణువు భక్తులకి శ్రీమహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడు అవేమిటంటే….

1.నిత్యం ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఇంట్లో దరిద్రం తోలిగిపోతుంది

2.ఎప్పుడైతే ఎక్కువ డబ్బు సమస్యలతో బాధపడుతుంటే అప్పుడు నోరులేని మూజ జీవాలకు రోజు ఏదోక ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి ఇలాగా మూగ జీవలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి తొందరగా అనుగ్రహిస్తుంది.

3. ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు కచ్చితంగా ఉండాలి. అలాగే తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు.

4. గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. ఇలాగా చేస్తే శ్రీమహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది.

5. లక్షి దేవిని ఎప్పుడు కూడా గణపతితో మరియు శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. ఇలా చేసే ఆవిడా తొందరగా అనుగ్రహిస్తుంది.