అమలాపాల్‌కి ఆ హీరోతో లింకుందా?

0amala paul-రెండేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌, విజ‌య్‌ల జంట విడిపోవ‌డం ఇప్పుడు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. మేడ్ ఫ‌ద‌ర్ ఈచ్ అద‌ర్‌గా క‌నిపిస్తూ నిన్న మొన్న‌టివ‌ర‌కు అన్యోన్య‌మైన జంట‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అమ‌లాపాల్, విజ‌య్‌లు మ‌రీ ఇంత తొంద‌ర‌గా విడిపోయారేంటి అని అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈజంట మ‌ధ్య చిచ్చుకు గ‌ల కార‌ణాల గురించి ఒకొక్క‌రు ఒక్కో క‌థ‌గా చెబుతున్నారు. అమ‌లాపాల్ సినిమాల్లో న‌టించ‌డం విజ‌య్‌కి ఇష్టం లేక‌పోవ‌డ‌మే గొడ‌వ‌కి కార‌ణ‌మ‌ని కొంద‌రంటే ఇంకొంద‌రు త‌మిళంలోని ఓ స్టార్ క‌థానాయ‌కుడే అస‌లు కార‌ణం అంటున్నారు. మ‌రికొంద‌రేమో పంజాబ్‌కి చెందిన ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అంటున్నారు. అస‌లు విష‌య‌మేంట‌న్న‌ది మాత్రం ప‌క్కాగా తెలియ‌లేదు. కానీ త‌మిళ‌నాట మాత్రం ఓ స్టార్ క‌థానాయ‌కుడిగా గురించే ఎక్కువ‌గా మాట్లాడుకొంటున్నారు. ఆ హీరోతో ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు చేసిన అమ‌లాపాల్ తాజాగా మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పుకొంద‌ట‌. వాళ్లిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్య‌మే విజ‌య్‌కి న‌చ్చ‌లేద‌ని, అందుకే ఆమెతో తెగ‌దెంపులు చేసుకొన్నాడ‌నే వార్త‌లొస్తున్నాయి. విజ‌య్‌, ఆయ‌న కుటుంబం స్పందించారు కాబ‌ట్టి రేపో మాపో అమ‌లాపాల్ కూడా స్పందించే అవ‌కాశాలున్నాయ‌ని త‌మిళ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.