Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ హౌస్ కు ‘నివర్’ ఎఫెక్ట్..కంటెస్టెంట్ల తరలింపు!

బిగ్ బాస్ హౌస్ కు ‘నివర్’ ఎఫెక్ట్..కంటెస్టెంట్ల తరలింపు!


నివర్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో బిగ్బాస్ సీజన్ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్ ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ మీద కూడా పడింది. బిగ్ బాస్ హౌస్ ను వరద ముంచెత్తినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఉంటున్న గదుల్లోకి వరద నీరు వచ్చేసిందట. వెంటనే అలర్టయిన బిగ్ బాస్ నిర్వాహకులు ఇంటి సభ్యులను అక్కడి నుంచి రహస్యంగా ఓ హోటల్ కు తరలించినట్టు సమాచారం.

నివర్ ఎఫెక్ట్ తో గత రెండురెండ్రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. అయితే నివర్ తాకిడి చెన్నైలోని బిగ్ బాస్ హౌస్ కి తాకిందట. దీంతో బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందారట. భారీ వర్షాలకు చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి చేరింది. అయితే ఇంటి సభ్యులను మాత్రం సేఫ్గా ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించారట.

అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఇంటి సభ్యుల కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్టు సమాచారం. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు మాట్లాడకుండా వేర్వేరు వాహనాల్లో హోటల్ కు తరలించారట. అనంతరం బిగ్బాస్ హౌస్ లోని వరద నీటిని బయటకు తోడేశారు. గదులను శుభ్రపరిచారు. ఇందుకోసం దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. అనంతరం ఇంటి సభ్యులను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి నీళ్లే రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం ఓ టాస్క్ లో భాగంగానే తాము ఇంటి సభ్యులను హోటల్ కు తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.