Templates by BIGtheme NET
Home >> Telugu News >> కోవాక్సిన్ కరోనా టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

కోవాక్సిన్ కరోనా టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన


దేశీయంగా తయారు చేసిన తొలి మేడ్ ఇన్ ఇండియా టీకా ఏదైనా ఉందంటే అది భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కోవాగ్జిన్ ’ మాత్రమే. దీన్ని భారత వైరాలజీ శాస్త్రవేత్తలు ఐసీఎంఆర్ బృందంతో కలిసి భారత్ బయోటెక్ తయారు చేసింది.

కరోనా వైరస్ ను నిరోధించేందుకు దేశీయంగా తయారు చేసిన ఈ కోవాగ్జిన్ టీకాకు భారత్ ప్రభుత్వం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఈ క్రమంలోనే తాజాగా భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదంపై తీవ్ర చర్చ మధ్య తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 25800 మంది నియామకాలను పూర్తి చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. 3వ దశ ట్రయల్స్కు సంబంధించిన వాలంటీర్ల ఎంపిక పూర్తయిందని తెలిపింది.

మొత్తం 23వేల మంది వలంటీర్లపై 3వ దశ ప్రయోగాలను భారత్ బయోటెక్ జరుపుతోంది. మార్చిలో ఈ పరీక్షల డేలా వెలువడనుంది. ఇప్పటికే 5000 మందికి పైగా టీకా రెండు డోసులను తీసుకున్నారని విజయవంతమైందని తెలిపింది.