ఎన్టీఆర్ చిత్రంలో హంసకి లక్కీ ఛాన్స్

0Hamsa-nandini-and-NTRవంశీ ‘అనుమానాస్పదం’ చిత్రంతో హీరోయిన్ గా అందరి దృష్టిలో పడిన నటి హంసానందిని ‘అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ చూడలేక రూట్ మార్చి స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది. అలా వరుసగా ఆమె నటించిన ‘ఈగ, మిర్చి, అత్తారింటికి దారేది, లెజెండ్’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో లక్కీ లేడీగా పేరు సంపాదించుకుంది. స్పెషల్ సాంగ్లో ఆమె ఉంటే సినిమా విజయం ఖాయమనే నమ్మకం కూడా వచ్చేసింది.

తాజాగా ఆమె స్పెషల్ సాంగ్ చేసిన రాజ్ తరుణ్ చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కూడా విజయం సాధించింది. అందుకే ఆమెను జూ. ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో సైతం ఒక చిన్న రోల్ కోసం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాత్రకు సంబందించిన షూటింగ్ కూడా మొదలైందని అంటున్నారు. అయితే ఈ వార్తపై సినిమా యూనిట్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు.