ఖైదీ నెం.150, గౌతమి పుత్రి శాతకర్ణి పై మహేష్ ప్రశంసలజల్లు

0Mahesh-Babuటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సంక్రాంతి బిగ్ సినిమా సంబరాలపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ ‘ ఖైదీ నెం.150, ‘గౌతమి పుత్రి శాతకర్ణి’ సినిమాలపై వరస ట్వీట్లలో ప్రశంసల జల్లు కురిపించారు.

సాధారణంగా సినిమాలపై చాలా తక్కువగా స్పందించే ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ , మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సెన్సేషనల్ మూవీలపై ట్విట్టర్ ద్వారా స్పందిండం విశేషం. తన బీజీ షెడ్యూల్ లో ఈ రెండు సినిమాలను చూడటానికి సమయం కుదుర్చుకున్న మహేష్ .. ఖైదీ150,గౌతమి పుత్రి శాతకర్ణి విజయాలపై హర్షం వ్యక్తం చేశారు. రెండు సినిమాల టీములకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బిగ్ మూవీలతో సంక్రాంతి సంబరాల వర్షం కురుస్తోందంటూ అభినందనలు తెలిపారు. అలాగే 150 వ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మిస్.. అయ్యాం..వెల్ కం బ్యాక్ అన్నారు. ఆయన లుక్స్ అద్భుతమనీ, తన మ్యాజిక్ తో అత్యంత ఉన్నతంగా నిలిచారని మహేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు మీ విజన్ కు, కన్విక్షన్ కు హ్యట్స్ ఆఫ్ అంటూ నందమూరి బాలకృష్ణ ను ఉద్దేశించి కమెంట్ చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణిలో ఆయన నటన టాలీవుడ్ లో ఉత్తమమైన ప్రదర్శనగా నిలుస్తుందని కొనియాడారు.