పెద్ద కొడుకుని దూరం పెట్టిన నాగ్

0అక్కినేని బుల్లోడు నాగచైతన్య నటించిన `శైలజారెడ్డి అల్లుడు` నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. అల్లుడిగా నాగచైతన్య పెర్ఫామెన్స్ ఎలా ఉంది? అత్తగా రమ్యకృష్ణ ఎలా నటించింది? కూతురిగా అనూ ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చింది? ఈగోయిస్టుల కథేంటి? వాస్తవ రిజల్ట్ ఏంటి? ఇంకో గంటలోనే సమీక్షకులు తేల్చనున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్టు ఎంపిక ఛాయిస్ ఎవరిది? నాగచైతన్యనే స్వయంగా ఎంపిక చేసుకున్నాడా.. లేక నాగార్జుననే మారుతిని పిలిచి `అల్లరి అల్లుడు` లైన్ లో ఏదైనా కథ రాయమన్నారా? ఇదే ప్రశ్నను నాగచైతన్యనే అడిగేస్తే ఏమన్నాడంటే…?

అసలు నాన్నగారు నా స్క్రిప్ట్ ల్లో వేలు పెట్టడం మానేసి చాలా కాలమైంది అని అన్నాడు. ప్రతి ఒక్కరూ వేరొకరిపై ఆధారపడతారు. నాన్ననో – స్నేహితుడో లేక ఎవరైనా ఆత్మీయుడో తప్పకుండా మన కథల్ని వినాల్సి ఉంటుంది. అలా అప్పట్లో నాన్నగారు నా కథలు వినేవారు. కానీ ఇటీవల అస్సలు ఆయన పట్టించుకోవడం లేదు. నా కథల్ని నేనే ఎంపిక చేసుకుంటున్నా. చివర్లో ఎడిట్ టేబుల్ పై ఉన్నప్పుడు మాత్రమే నాన్న ఇన్వాల్వ్ అవుతారు.. ఏదైనా సజెస్ట్ చేస్తారు… అని తెలిపారు. రీసెంట్ ఇంటర్వ్యూలో చై ఈ విషయాన్ని వెల్లడించారు.

దీనిని బట్టి చైతన్య వినే స్క్రిప్టుల్ని కింగ్ దూరం పెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అఖిల్ ఇంకా మూడో సినిమా కిడ్ కాబట్టి అతడి స్క్రిప్టుల విషయంలో నాగార్జున ప్రమేయం ఉంటుందనడంలో సందేహం లేదు. అఖిల్ 3 టైటిల్ `మిస్టర్ మజ్ను` అన్న మాట వినిపిస్తోంది. దీనిపై అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. ఈరోజు వినాయక చవితి కానుకగా టైటిల్ ప్రకటిస్తారనుకుంటే ఇప్పటివరకూ అప్ డేట్ లేనేలేదు.