కింగ్ వ్వాటే ఫన్నీ వర్కవుట్

0

కింగ్ నాగార్జున ఎనర్జీ లెవల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షష్ఠిపూర్తి (60) కి చేరువగా ఉన్నా ఆయన ఇంకా నవమన్మధుడిలా చెలరేగుతూ అందరికీ షాకిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 29తో ఆయన 60వ పడిలో అడుగుపెడుతున్నారు. అయినా ఫిట్ నెస్ పరంగా యువహీరోలంతా సెల్ఫ్ గోల్ పెట్టుకునేలా ఆయన ఇస్తున్న స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎక్కడ ఉన్నామన్నది కాదు.. జిమ్ విరిచేసామా లేదా? అన్నది మాత్రమే ఆయన టార్గెట్. ఇటీవలే విదేశాల్లోని ఓ అడవి లో చెట్టుకు వేలాడుతూ ఆయన స్ట్రెచ్చింగ్ బెల్ట్ పెట్టుకుని చేస్తున్న కసరత్తులు యూత్ ని షాక్ కి గురి చేశాయి. ఈ వయసులో ఆయన సాహసాలేంటి? అంటూ ముక్కున వేలేసుకున్నారు.

అక్కడితో అయిపోలేదు. `మన్మధుడు 2` కోసం ఆయన గెటప్ పూర్తి గా మార్చేస్తున్నారు. అందుకోసం కాలేజ్ బోయ్ లా వయసును సగం తగ్గించేస్తున్నారు. అందుకోసం కింగ్ రెగ్యులర్ గా కసరత్తులు చేస్తూ వేడెక్కించేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా యువకథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి కింగ్ జిమ్ చేస్తున్న దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో కింగ్ షేర్ చేశారు. `మన్మధుడు 2` దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఈ వీడియోని కెమెరాలో బంధించారని అక్కడ సీన్ చూస్తుంటే అర్థమవుతోంది. షాట్ రెడీ.. వస్తున్నారా? అంటూ రాహుల్ రవీంద్రన్ నేరుగా కింగ్ జిమ్ చేస్తున్న చోటికి వచ్చేశారు. షాట్ రెడీ .. అంటూ పిలిస్తే .. ఈ జిమ్ భలే ఉంది కదా… మన దగ్గర కూడా ఉంటే బావుండేది! అంటూ కింగ్ బోలెడంత ఫన్ క్రియేట్ చేశారు. ఇంతలోనే సర్ రకుల్ ఎక్కడ? అంటూ ప్రశ్నించాడు రాహుల్.

ఆ పక్కనే సెగలు కక్కుతూ రకుల్ ప్రీత్ జిమ్ చేస్తున్న తీరును కింగ్ చూపించారు. జిమ్ చేస్తోంది కదా.. అయిపోయిన తర్వాత షూట్ కి వస్తుంది. ఈలోగా మనం వెళదాం పద! అంటూ రాహుల్ తో కలిసి కింగ్ జిమ్ నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వీడియోని చాలా లైవ్ లీగా .. ఫన్ జనరేట్ చేస్తూ ఆసక్తికరంగా చిత్రీకరించారు. మొత్తానికి మన్మధుడు 2 టీమ్ ఎంతో కూల్ గా విదేశీ షూటింగ్ ని పూర్తి చేస్తోంది. నాగార్జున ఎలాంటి టెన్షన్లు లేకుండా తన వయసును తగ్గించుకుంటూ అందరికీ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేస్తారని ఇదివరకూ ప్రచారమైంది. అందుకు తగ్గట్టే జెట్ స్పీడ్ తో షూటింగ్ ని పూర్తి చేస్తున్నారని తాజా సన్నివేశం చెబుతోంది. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజులోనూ నాగార్జున నటించనున్న సంగతి తెలిసిందే. అతిధి పాత్ర పోషించిన బ్రహ్మాస్త్ర త్వరలో రిలీజ్ కి రానుంది.
Please Read Disclaimer