రామ్ చరణ్-సుకుమార్ చిత్రంకి టైటిల్ పిక్స్!

0


Ram-Charan-in-Rangasthalam-1985ఇప్పుడు మెగాభిమానులు అందరూ కూడా.. అసలు రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఎప్పుడు చెబుతారూ అంటూ సుకుమార్ ను సోషల్ మీడియా ద్వారా అలజడి పెట్టేసిన సంగతి తెలిసిందే. స్వయంగా మెగా పవర్ స్టార్ లైన్లోకి వచ్చి.. టైటిల్ కావాలని అడగంటి అంటూ ఒక వీడియో మెసేజ్ ఇస్తే.. ఎవరు మాత్రం అడగకుండా ఉంటారు చెప్పండి. ఇప్పుడికి ఆ వెయిటింగ్ కు తెరపడినట్లే. టైటిల్ చెప్పేశారు.

సుకుమార్ డైరక్షన్లో.. రామ్ చరణ్ అండ్ సమంత లీడ్లో.. మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పేరును ”రంగస్థలం 1985” అని పెట్టేశారు. ఆల్రెడీ ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని తెలుసు కాని.. అందరూ కూడా 1947 కంటే ముందు జరిగే సినిమా అనుకున్నారు. కాని ఇది 1985లో జరిగే ఒక కథ అని టైటిల్ చూస్తే తెలుస్తుంది. ఇకపోతే సినిమాకు ‘రంగస్థలం’ అనే పెట్టారంటే.. ఇందులో ఏమన్నా హీరో నాటకాలలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడా? లేకపోతే బ్రతుకే ఒక జగన్నాటకం అనే పరమార్ధంతో సుకుమార్ అలా పెట్టాడో ఇంకా తెలియదు.

ఏదేమైనా కూడా.. ఈ మధ్యన ఫక్తు కమర్ఫియల్ సినిమాలను ఎక్కువ చేస్తున్నాడన్న టాక్ వచ్చేస్తున్న వేళ.. మొన్న ధృవ.. ఇప్పుడు రంగస్థలం 1985.. రామ్ చరణ్ కొత్త పుంతల్లోకి వెళ్తున్నాడని చెప్పకనే చెబుతున్నాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అండ్ మహష్ బాబు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి అని చెబుతుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సంక్రాంతి 2018న తన సినిమా రిలీజ్ అంటున్నాడు.