హీరోయిన్ భర్తతో చిరుకి గొడవేంటీ ?

0Anjala-jhaveri-husbandఈ హీరోయిన్ తో చిరంజీవి రొమాన్స్ చేశాడు. ఇప్పుడు ఆమె భర్త చిరుకి విలన్ అయ్యాడు. ఇది నిజం. “చూడాల‌ని వుంది” సినిమాలో చిరుకి జోడీగా న‌టించింది ముద్దుగుమ్మ అంజ‌లా జావేరి. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ పాపులర్ అయ్యింది. బాలీవుడ్ నటుడు త‌రుణ్ అరోరాని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. ఆ మధ్య శేఖర్ కమ్మల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో బ్యూటీఫుల్ ఆంటీగా ఆకట్టుకొంది. అయితే, ఇప్పుడు ఆమె భర్త త‌రుణ్ అరోరా చిరంజీవికి విలన్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘నెపోలియన్’లో చిరుకి విలన్ గా ఎంపికయ్యాడు తరుణ్. తరుణ్ తో పాటుగా వివేక్ ఓబెరాయ్‌, జ‌గ‌ప‌తిబాబు పేర్లు ప‌రిశీలించిన చిత్రబృందం.. చివరికి తరుణ్ ని ఓకే చేసింది.

ఇదిలావుండగా.. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిరు ‘నెపోలియన్’.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. ఇప్పటివరకు చిరు 150కిఅన్నీ కుదిరినా హీరోయిన్ మాత్రం ఓకే కాలేదు. అనుష్క, నయనతార, నర్గీస్ ఫక్రీ,… చివరకి కాజల్ దగ్గరకి వచ్చి ఆగింది. చిరు సినిమా కోసం కాజల్ పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుందనే వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.