మెగాస్టార్ కు ముగ్గురు భార్యలు?

0Chiranjeevi-interview-picముగ్గురు భార్యలనగానే ఇదేదో పవన్ కళ్యాణ్ పేరుకు బదులు చిరంజీవి పేరు పొరపాటున వచ్చిందనుకోవద్దు. నిజమే.. మెగాస్టార్ ముగ్గురు భార్యల ముచ్చటే ఇది. కానీ.. నిజ జీవితంలో కాదు తెరపైన కథలోని ముచ్చట ఇది. అవును.. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమాలో కథ ప్రకారం ముగ్గురు భార్యలుంటారట. అయితే… దర్శకులు అసలు కథ ప్రకారం ఈ ముగ్గురు భార్యలను ఉంచుతారా.. లేదంటే మెగాస్టార్ తో స్క్రీన్ పైనా ఏకపత్నీవ్రతం చేయిస్తారా అన్న చర్చ ఫిలిం సర్కిళ్లలో నడుస్తోంది.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.. ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తన 151వ చిత్రానికి ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలుండేవారని చెబుతుంటారు. ఆ ప్రకారమే సినిమాలోనూ చిరంజీవికి ముగ్గురు భార్యలను ఉంచుతారో లేదో చూడాలి. అసలే.. మెగాస్టార్ సరసన నటించదగ్గ కథానాయికలకు కరవు రావడంతో ఏకంగా ముగ్గురిని వెతకాలంటే కష్టమే.

అందుకే కథలో స్వల్ప మార్పులు చేసి ఇద్దరు లేక ఒకే హీరోయిన్ తో సరిపెడతారని వినిపిస్తోంది. ముగ్గురు కథనాయికలుంటే బడ్జెట్ కూడా పెరిగే ప్రమాదముంది. మరి సీరియస్ కథ కావడంతో రొమాన్సు కూడా బాగా పండించాలంటే ముగ్గురు నాయికలకు ఓటేసే చాన్సుంది.