బిజెపి అమ్మాయితో నారా వారి అబ్బాయి రొమాన్స్

0nara-rohotనారా వారి కుటుంబ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న నారా రోహిత్ నటించినవి కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచు కున్నాడు. హ్యాండ్ సమ్ హీరోగా మంచి బేస్ వాయస్ తో నెమ్మదిగా ఎదుగుతున్న ఈ నారా వారి హీరో ‘రౌడీ ఫెలో’ అనే సినిమాతో త్వరలో ముందుకు రానున్నాడు. ఈసినిమాలో రోహిత్ పక్కన రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ పేరు విశాఖా సింగ్.

ఈ సినిమా కోసం బాలీవుడ్ లో ఎంతోమందిని ఆడిషన్ చేసిన తరువాత ఈ ముద్దు గుమ్మను రోహిత్ పక్కన హీరోయిన్ గా ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎంపిక చేసారు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అమ్మాయి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాధ్ సింగ్ కు చాల దగ్గర చుట్టం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక పక్క నారా రోహిత్ పెద్దనాన్న చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అబ్బాయి రోహిత్ ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడి బంధువునే లైన్ లో పెట్టాడు అంటు రోహిత్ పై సెటైర్లు వేస్తున్నారు. మరొక ఆశక్తికర విషయం ఏమిటంటే విశాఖా సింగ్ రోహిత్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కావడం వెనుక బిజెపి జాతీయ అధినేత రాజనాధ్ సింగ్ ప్రమేయం కూడ ఉంది అంటారు. ఎదిఎమైనా త్వరలో అధికారంలోకి రాబోతున్న జాతీయ పార్టీ అధినేత దగ్గర చుట్టాన్ని లైన్ లో పెట్టుకున్న ఘనత నారా రోహిత్ కు దక్కుతుంది.