Templates by BIGtheme NET
Home >> Cinema News >> సింహాను మిస్ అయినందుకు జీవితాంతం బాధ ఉండిపోతుంది

సింహాను మిస్ అయినందుకు జీవితాంతం బాధ ఉండిపోతుంది


మాస్ సినిమాలకు.. యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాలకు కథలు మాటలు అందించడంలో పరుచూరి బ్రదర్స్ ది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు అద్బుతమైన కథలు మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ ను స్టార్ హీరోలకు అందించారు. సుదీర్ఘ కాలంగా రచయితగా కొనసాగుతున్న పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాలను యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటూ వస్తున్నారు. పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త వారికి అవగాహణ కలిగేలా ఆయన ఒక్కో సినిమా గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమా గురించి పరుచూరి పలుకుల్లో మాట్లాడారు. సింహా సినిమా కోసం 15 రోజులు బోయపాటితో ట్రావెల్ చేశాం. కాని ఆ సినిమాకు మాటలు అందించలేక పోయాం అంటూ గోపాల కృష్ణ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

గోపాల కృష్ణ మాట్లాడుతూ.. నిర్మాత పరుచూరి ప్రసాద్ ఒక రోజు బాలకృష్ణ గారి డేట్లు ఓకే అయ్యాయి. కథ కావాలంటూ మా వద్దకు వచ్చారు. ఆ సమయంలో బాలయ్య.. బి గోపాల్ ల కాంబోలో సినిమాను చేద్దాం అనుకున్నాం. కథను మరియు మాటలనే మేము రాసి ఇవ్వాలనుకున్నాం. కాని ఆ సమయంలో బి గోపాల్ అందుబాటులో లేకుండా పోయారు. దాంతో ఆయన స్థానంలో యువ దర్శకుడిని తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే భద్ర.. తులసి వంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను పేరును సూచించాం. 15 రోజుల పాటు మా ఆఫీస్ లో బోయపాటితో కథ చర్చలు జరిగాయి. బోయపాటి చాలా కథలు చెప్పారు. మేము రాజశేఖర్ హీరోగా అనుకున్న కామ్రేడ్ కథను చెప్పాను. ఆ కథ వంటిదే తన వద్ద ఉందని బోయపాటి అన్నాడు. ఆ కథను బోయపాటి పూర్తి చేస్తే మాటలు మేము రాస్తామని అన్నాం.

బోయపాటి సింహా కథతో కొన్ని రోజులు కొరటాల శివతో మరికొన్ని రోజులు రత్నంతో కలిసి కూర్చుని చర్చలు జరిపినట్లుగా తెలిసింది. కథ కోసం వారు చర్చలు జరుపుతున్నారని మాటలు రాసేది మేమే అనుకున్నాం. అనుకోకుండా నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక వెబ్ సైట్ లో సింహా మూవీ కథ.. మాటలు.. స్ర్కీన్ ప్లే.. దర్శకత్వం బోయపాటి అని చూశాను. నేను అమెరికా వెళ్లడం వల్ల ఆ ప్రాజెక్ట్ చేయి జారి పోయింది. మొత్తానికి బోయపాటి సినిమాను చాలా అద్బుతంగా తెరకెక్కించారు. డైలాగ్స్ కూడా బాగా రాశాడు. ఆ సినిమాకు డైలాగ్స్ రాయలేక పోయాము అనే బాధ జీవితాంతం ఉంటుందని పరుచూరు వారు ఆవేదన వ్యక్తం చేశారు.