సీక్వెల్ లు తీసే సాంప్రదాయానికి నాంది పలికిన హాలీవుడ్ లో సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్ రూపొందుతుంది.
అదే సినిమా సూపర్ హిట్ అయితే నాలుగయిదు సీక్వెలు రూపొందుతాయి. తాజాగా ఇదే కోవలోకి వస్తుంది టామ్ క్రూజ్ కు స్టార్ ఇమేజి తెచ్చిపెట్టిన సినిమా మిషన్ ఇంపాజబుల్. ఇప్పటికే ఈ సినిమాకు మూడు సీక్వెల్లు రాగా మూడూ ఘనవిజయాన్ని సాధించాయి.తాజాగా ఈ సినిమాకు నాల్గవ భాగం రూపుదిద్దుకుంటోంది. 2011వ సంవత్సరంలో విడుదల అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు మిషన్ ఇంపాజబుల్-lll సినిమాకు దర్శకత్వం వహించిన జెజె అబ్రమ్స్, పారామౌంట్ ప్రొడక్షన్స్ తో కలసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన మూడు భాగాలకన్నా ఈ సినిమా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందనుందని అబ్రమ్స్ వెళ్లడించారు. ఈ వార్త ఖచ్చితంగా యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే వారికి శుభవార్తే.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- భార్య సినిమాలతో... భర్త ఇంటి పనులతో బిజీ బిజీ..
- తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!
- ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
Older news items:
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!
- ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!
- రెండో పెళ్లయినా నిలబడేనా..!?
- 'అవతార్' సినిమాకు ఇక ఆస్కార్ అవార్డు కలలో మాటే..!!
- ఆ సూపర్ హిట్ బూతు చిత్రం త్రీడీలో






















