తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > కెవిపి అవినీతిపై ప్రధానికి పాల్వాయి ఫిర్యాదు



కెవిపి అవినీతిపై ప్రధానికి పాల్వాయి ఫిర్యాదు

E-mail Print
User Rating: / 0
PoorBest 
తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి చెప్పారు. కెవిపి అక్రమాలకు పాల్పడినట్లు తెలుగుదేశం శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు అసత్యమని తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని, లేకుంటే కాంగ్రెసు వారంతా అవినీతిపరులనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుందని, దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెవిపి అవినీతిపరుడని తాను అనలేదని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణ గురించి మాత్రమే ప్రస్తావించానని ఆయన అన్నారు.

జలయజ్ఝం ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ విషయం భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా తెలుసునని ఆయన అన్నారు. జలయజ్ఝంలోని అవినీతి వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని ఆయన అన్నారు. దాని వల్ల రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. దానివల్లనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో 30 నుంచి 40 శాతం వరకు అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. దీనిపై తమ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, లేకపోతే రోశయ్య ప్రభుత్వం సరిగా నడవడం కష్టమని ఆయన అన్నారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 217 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...