తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > పిసిసిపై జగన్ కన్ను?



పిసిసిపై జగన్ కన్ను?

E-mail Print
User Rating: / 0
PoorBest 
ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి విఫలమైన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవిపై కన్నేశారు. పిసిసి పదవిని చేపట్టి తద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ ను కూడగట్టి ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన ఆశయంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసులో తిరుగులేని నాయకునిగా ఎదిగేందుకు పిసిసి అధ్యక్ష పదవిని పనిముట్టుగా వాడుకోవాలని ఆయన చూస్తున్నారని వినికిడి. ముఖ్యమంత్రి పదవి దక్కదని అర్థమైన తర్వాత నిజానికి, వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించాలని భావించారు. ఆయన వర్గమంతా అందుకు సన్నాహాలు కూడా చేసిందట. అయితే, వైయస్ జగన్ ఎవరికీ చెప్పకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తనకు పిసిసి పదవి ఇవ్వాలని కోరారని సమాచారం. అందుకు, సరే, చూద్దామని ఆమె అన్నట్లు చెబుతారు. ఈ హామీపైనే ఆయన నమ్మకం ఉంచినట్లు చెబుతున్నారు.

మరోసారి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికే కడపలో వైయస్ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. రాష్టవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పడానికి దాన్ని వేదికగా వాడుకున్నారని సమాచారం. ఏప్రిల్ 2వ తేదీ నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తానని చెప్పడం ద్వారా అధిష్టానానికి పరోక్ష హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు. సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనను కూడా ఆయన మరోసారి ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. అయితే, పార్టీ పెట్టే సందర్భం దాటిపోయిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వల్ల తెలంగాణ కాంగ్రెసు నాయకులెవరూ కలిసి వచ్చే పరిస్థితి ఉండదని ఆయన సన్నిహితులు చెప్పినట్లు సమాచారం.

ఈ స్థితిలో వైయస్ జగన్ ను పిసిసి సమన్వయ కమిటీలో పార్టీ అధిష్టానం వేసింది. తద్వారా వచ్చే శాసనసభ సమావేశాలకు వైయస్ జగన్ అనుచర శాసనసభ్యులు అనివార్యంగా సహకరించేలా చూడాలనేది అధిష్టానం యోచనగా భావిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ బహుశా ఈ సెప్టెంబర్ లో దిగిపోవచ్చు. అప్పటికి ఆ పదవిని తన చేతుల్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే అధిష్టానానికి చెందిన నాయకులు, ముఖ్యంగా సోనియా గాంధీ జగన్ ను నమ్ముతారా అనేది అనుమానంగానే ఉంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మాత్రం జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సమన్వయ కమిటీలో డి. శ్రీనివాస్ కింద ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అందుకు జగన్ ఏ మేరకు అంగీకరిస్తారనేది కూడా అనుమానమే. అయితే, జగన్ పరిస్థితి రెంటికి చెడిన రేవడి అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 297 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

నెలాఖరున త్రిష 'దోపిడి '

విజయ్‌, త్రిష జంటగ...

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...