తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > ఎన్టీఆర్ అదుర్స్: నాని వర్సెస్ హరీష్



ఎన్టీఆర్ అదుర్స్: నాని వర్సెస్ హరీష్

E-mail Print
User Rating: / 2
PoorBest 
జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా ప్రదర్శనపై తెలుగుదేశం శాసనభ్యుడు, ఆ చిత్ర నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అదుర్స్ సినిమాను అడ్డుకోలేని తెలంగాణవాదులు సమైక్యాంధ్రను అడ్డుకోగలరా అని ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. కొడాలి నాని ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, నానిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బతిమాలడం వల్లనే అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోలేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని ఆయన అన్నారు. నాని క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బ తీసిన నాని హైదరాబాదులో తిరగలేరని ఆయన హెచ్చరించారు. సమైక్యవాదాన్ని సినిమా ప్రదర్శనతో ముడి పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు.

మీడియా తన మాటలను వక్రీకరించిందని కొడాలి నాని అన్నారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అదుర్స్ ఓపెనింగ్స్ దెబ్బ తినడం వల్ల కోటి రూపాయలు నష్టపోయామని ఆయన చెప్పారు. హైదరాబాదులో తిరగనివ్వమనడానికి హరీష్ రావు ఎవరని ఆయన అడిగారు. ఎన్టీఆర్ పై అభిమానంతోనే అదుర్స్ సినిమాను అడ్డుకోలేదని, నాని మాట్లాడిన తీరు బాగా లేదని శాసనసభ్యురాలు సీతక్క అన్నారు. కాగా, వరంగల్ లో అశోక్ థియేటర్ లో బిందాస్ సినిమా ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 221 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...