వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం
ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దిల్ రాజు...ఎన్టీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అదే రోజున ఎన్టీఆర్ హీరోగా చేసిన 'యమదొంగ' రిలీజైంది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న ఎన్టీఆర్ ని నిలబెట్టింది. దాంతో ఆగస్టు 15న ఎన్టీఆర్ ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. అందులోనూ ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కూడా కావటంతో ఆ డేట్ నే ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. కాజల్, సమంతా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ లవర్ బోయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం కర్నాటకలోనూ, కేరళలోనూ షూటింగ్ జరగనుంది. మరో ప్రక్క ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ డైరక్టర్స్ ఇద్దరూ ఇంతకు ముందు ప్రభాస్ తో సినిమా చేసి (మున్నా,బిల్లా) ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న వారే కావటం విశేషం.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ప్రభాస్ 'డార్లింగ్' ఏప్రిల్ 16న
- అల్లరి నరేష్ 'బెట్టింగ్ బంగార్రాజు' రిలీజ్ డేట్
- గోపీచంద్ 'గోలీమార్' రిలీజ్ డేట్
- నెలాఖరున త్రిష 'దోపిడి '
- సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్
Older news items:
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"
- మార్చిలో "సూపర్కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!
- మార్చిలో ఉపేంద్ర, దీపికా పడుకునేల "కంత్రీ మొగుడు"
- పవన్ కళ్యాణ్ 'పులి' రిలీజ్ డేట్
- తాజ్మహల్ పూర్తయింది























