ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

0



Face-Steamingచాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి (స్టీమింగ్) పడుతుంటారు. నిజానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు, తలనొప్పులు తగ్గుతాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. వాస్తవానికి ఆవిరిపట్టడం ద్వారా ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందట.

అయితే, ముఖ సౌందర్యానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు, ఇతర లోషన్లు లభ్యమవుతున్పప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు అప్పుడు చర్మంపై దుష్ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా ముఖారవిందం అందవిహీనంగా మారిపోతుంది. ఒక్కోసారి ముఖంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కంటికింద నల్లటి ఛాయలు కూడా కనిపిస్తాయి.

ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే.. ప్రతి రోజూ వేడినీటితో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల సౌందర్యం బాగా మెరుగుపడుతుంది. ఈ స్టీమింగ్ అనేది సహజసిద్ధమైన చిట్కా. స్టీమింగ్ చేయడం వల్ల ముఖం ప్రెష్‌గా మారుతుంది. చర్మంలో ఉండే రంధ్రాలు తెరుచుకుని లోపల ఉండే మలినపదార్థాలను బయటకు తీసేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఫేషియల్ స్టీమింగ్ అటు అటు అందంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.