కేన్సర్ లక్షణాలు!

0cancer-symptomsకేన్సర్ బహిర్గత లక్షణాల గురించి తెలుసుకోవటం వలన వ్యాధి తీవ్రస్థాయికి చేరక ముందే, వైద్యుడిని కలిసి తగిన చికిత్స చేపించుకోవచ్చు. కానీ కొంత మంది పురుషులు ఈ లక్షణాలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు, ఆ లక్షణాలేంతో మీరే చూడండి.

1. నిలకడగా నొప్పి

నిలకడగా లేదా ఎక్కువ సమయం పాటూ నొప్పికి గురైతే వెంటనే వైద్యుడిఐ కలవమని “అమెరికన్ కేన్సర్ సొసైటీ” వారు సలహా ఇస్తున్నారు. ఎప్పటి నుండి నొప్పి వస్తుందో మరియు మీ దినచర్యల గురించి వైద్యుడితో చర్చించి, తగిన పరీక్షలు జరిపి, నొప్పికి అసలు కారణం ఎంతో తెలుసుకోండి.

2. రొమ్ము పరిమాణంలో మార్పులు

చాలా మంది పురుషులు, మగవారు రొమ్ము కేన్సర్ కు గురవరని, ఈ రకం కేన్సర్ కేవలం మహిళలలో మాత్రమే కలుగుతుందని భ్రమ పడుతుంటారు. కానీ, రొమ్ము కేన్సర్ పురుషులలో కలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పురుషులు గనుక వారి ఛాతి ప్రాంతంలో ఎవైన గడ్డ వంటి వాటిని గమనించినా లేదా రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించిన వెంటనే వైద్యుడిని కలవండి.

3. దీర్ఘకాలికంగా జ్వరం

కొన్ని సార్లు చాలా రకాల కేన్సర్ వ్యాధులు మొదటగా జ్వరంగా బహిర్గతం అవుతుంటాయి. శరీరంలో కేన్సర్ ప్రారంభమైన ప్రాంతం నుండి ఇతర ప్రాంతానికి లేదా ఇతర శరీర భాగానికి వ్యాపించినపుడు రోగికి జ్వరం వస్తుంది. దీర్ఘకాలిక సమయం పాటూ జ్వరం ఉందని గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మంచిది.

4. బరువులో ఆకస్మిక తగ్గుదల

ఎలాంటి బరువు తగ్గించే ప్రయత్నం చేయకుండానే, తక్కువ కాలంలో పూర్తి శరీర బరువులో 10 శాతం వరకు బరువు తగ్గిన పురుషులు కేన్సర్ వ్యాధికి గురయ్యారని తెలిపే ఒక సూచిక. ఇలా కారణం లేకుండా బరువు తగ్గటం గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మంచిది.

5. అలసట

సరైన సమయం పాటూ విశ్రాంతి, ఆహరం తిన్నను అలసట కలుగుతుందా? అయితే తప్పక వైద్యుడిని కలవండి. ఇలా అస్తమానం అలసటకు గురవటం కూడా కేన్సర్ వ్యాధి యొక్క బహిర్గత లక్షణం. ఇలాంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి, అలసటకు గల కారణాలేంటో తెలుసుకోండి.