Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> చర్మంపై ఆలివ్ ఆయిల్ వాడటం వలన కలిగే ప్రమాదాలు

చర్మంపై ఆలివ్ ఆయిల్ వాడటం వలన కలిగే ప్రమాదాలు


మన పూర్తి ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ చాలా సహాయపడుతుంది, కానీ, కొన్ని సార్లు చర్మ సమస్యలను కూడా కలిగించవచ్చు. ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో మీరే చూడండి.
1మొటిమలు కలుగుతాయి
ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడటం వలన కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. ఆలివ్ ఆయిల్ ను కొద్ది సమయం పాటూ చర్మంపై ఉంచిన పిదప, చర్మం గ్రహించుకోవటం ఆలివ్ ఆయిల్ ను గ్రహించటం చాలా కష్టం. ఫలితంగా ఒక పొర వలే చర్మంపై ఏర్పడుతుంది. దీనిపై దుమ్ము, ధూళి లు ఈ పొరలో పేరుకుపోయి, మొటిమలకు కారణం అవుతాయి.

2స్కిన్ రాషేస్
జిడ్డు చర్మం కలిగి ఉండే వారు ఆలివ్ ఆయిల్ ను వాడకూడదు. ఒకవేళ ఆలివ్ ఆయిల్ వాడినట్లయితే, సీబం ఉత్పత్తి అధికమవుతుంది. ఫలితంగా చర్మం ఎరుపుగా మారటం, దురదలు మరియు స్కిన్ రాషేస్ వంటివి కలుగుతాయి.

3అలర్జీలను కలిగించవచ్చు
ఆలివ్ ఆయిల్ వలన చర్మంపై చెప్పుకోదగిన ప్రమాదకర పరిస్థితులేం కావు. ఏది ఏమైనప్పటికీ, మీరు దీని పట్ల అలర్జీలను కలిగి ఉంటే మాత్రం ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండండి. దీని పట్ల అలర్జీ కలిగి ఉండి కూడా చర్మానికి అప్లై చేస్తే, తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని కలవండి.

4శిశువులకు వాడకండి
ఆలోచించకుండా కొత్తగా జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ పూయటం మంచిది కాదు, ఎందుకంటే, ఆ శిశువు శరీరం ఆలివ్ ఆయిల్ పట్ల ఎలా గురవుతుందో మనకు తెలీదు, కావున చిన్న పిల్లలకు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయకండి. దీని వలన పిల్లల చర్మం కూడా చికాకులకు గురవుతుంది.

5పొడి చర్మానికి మంచిది కాదు
ఆలివ్ ఆయిల్, ఒలియిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది సహజ తేమలను తొలగిస్తుంది కావున పొడి చర్మ కలిగి ఉండే వారు వీటిని వాడకూడదు. కావున, ఆలివ్ ఆయిల్ ను వాకండి. చర్మ వైద్య నిపుణుడిని కలిసి మీ చర్మ రకాన్ని తెలుసుకొని దానికి తగిన ఉత్పత్తులను, ఆయిల్ లను వాడండి.