చుండ్రు నివారణకి ఇంట్లో అందుబాటులో ఉండే ఔషదాలు

0తలపై చర్మం నుండి పొడిగా చర్మం విడుదల అయితే దానిని చుండ్రుగా పరిగణించవచ్చు. వీటి వలన దురదలు కూడా కలుగుతుంటాయి. మార్కెట్ లో దొరికే ఏ ఉత్పత్తితో అయినా మీ చుండ్రుని పూర్తిగా నివారించడం కష్టం. పైగా ఈ ఉత్పత్తులు ఖర్చుతో కూడుకున్నవి. వీటి సహాయం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో, సహజంగా మీ ఇంట్లోనే చుండ్రుని పరిపూర్ణంగా నివారించవచ్చు.

ఇంట్లోనే చుండ్రుని నివారించడానికి అందుబాటులో ఉండే ఇంట్లో ఉండే ఔషదాల గురించి కింద తెలుపబడింది.

నిమ్మకాయ

నిమ్మ రసంలో ఉండే ఉపయోగకరమైన పదార్థాలు వెంట్రుకలను చైతన్యవంతంగా చేసి చుండ్రుని తొలగిస్తాయి. కేవలం మీరు రాత్రి పడుకునే ముందు నిమ్మ రసంతో మీ జుట్టుని మర్దన చేస్తే సరిపోతుంది. ఉదయం లేచాక మీ జుట్టుని చల్లని నీటితో కడగాలి. మీరు ఒక వంతు నిమ్మరసంతో పాటు, రెండు వంతుల కొబ్బరి నూనెతో కూడా మర్దన చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా మర్దన చేయడం వలన మీ చుండ్రుని నివారించవచ్చు.

ప్రకృతి పరమైన చికిత్స

సగం కప్పు కొబ్బరి నూనెతో లేక వేప నూనెలో, ఒక చిటికెడు కర్పూరాన్ని కలపాలి, ఈ మిశ్రమాన్ని తల మీద మర్దన చేసి రాత్రంతా ఉంచాలి. ఉదయం లేచాక నీటితో కడగాలి. అంతేకాకుండా, ఒక చిటికెడు ఆముదము, ఆవాల నూనె మరియు కొబ్బరి నూనె కలిపి మర్దన చేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయం వెచ్చటి నీటితో కడిగితే చుండ్రుని నివారించవచ్చు. ఈ రెండు పద్దతులు చుండ్రు నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఉసిరి

ఉసిరి నూనె తో మీ తల పై మర్దన చేయాలి. తరువాత కొద్దిగా తడిగా ఉన్న టవల్ తో, తల చుట్టూ కట్టి ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత ఒక మోస్తరు నీటితో కడిగినట్లయితే చుండ్రు నుంచి ఉపశమనం పొందుతారు.

వెనిగర్

వెనిగర్ తో చికిత్స చేయడం వలన మీ జుట్టు యొక్క pH సమతుల్యత సరిచేయబడుతుంది. వెనిగర్ వాడడం వలన మీ జుట్టులో షాంపూల వలన మరియు ఇతర ఉత్పత్తుల వలన ఉండిపోయిన అవశేషాలు తొలగిపోతాయి. ఒక చిటికెడు వెనిగర్ ని ఒక కప్పు స్వచ్చమైన నీటిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి అంటి, ఒక రాత్రంతా ఉంచి ఉదయం షాంపూతో కడగాలి. ఇలా చేస్తే మీ చుండ్రు తొలగిపోతుంది.

పైన చెప్పిన చిట్కాలతో కేవలం చుండ్రు పోవడమే కాకుండా ఒక పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. ఈ సహజ ఔషదాల ద్వారా జుట్టు ఆరోగ్యంతో పాటూ, వత్తైన మరియు మృదువైన జుట్టును పొందుతారు.

  • నిమ్మకాయ జుట్టుని శక్తివంతంగా చేస్తూ, చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • కొబ్బరి, వేప నూనె మరియు ఆముదం చుండ్రుని నివారిస్తాయి.
  • వెనిగర్ తో చికిత్స వలన మీ జుట్టు యొక్క pH సమతుల్యత సరిచేయబడుతుంది.
  • తలపై చర్మాన్ని, ఉసిరి నూనెతో మర్దన చేస్తే చుండ్రుని నివారించవచ్చు.