నెలలో పెళ్ళా? శరీరాకృతిని మంచి షేప్ లో మార్చే చిట్కాలు మీ కోసమే…

0ముందుగా శరీర భాగాన్ని ఎంచుకోండి

ఉదరభాగం, తొడలు లేదా పిరుదులు ఏ భాగం యొక్క ఆకృతి మార్చుకోవాలి అనుకుంటున్నారు? ఏ శరీర భాగాన్ని మంచి ఆకృతికి మార్చుకోవాలి అనుకుంటున్నారో ముందు ఎంచుకోండి. ఆ ప్రాంతాలు లేదా ప్రాంతానికి తగిన వ్యాయామాలు మరియు ఆహార ప్రణాలికలను పాటించండి. మీరు ఎంచుకునే ప్రణాళికలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఖచ్చితమైన నియమాలను ఏర్పరచుకొని, వాటిని అనుసరించి, వివాహంలో మంచి ఆకృతిని కనబరిచేలా చూసుకోండి.

ఆహార సేకరణకు ప్రణాళిక

మంచి ఆకృతి పొందుటకు, ఆరోగ్యకరమైన ఆహారం ఎలా వండాలో మరియు ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. మీ పోషకాహార నిపుణుడితో మాట్లాడి, పోషకాలను అధికంగా గల ఆహార ప్రణాళికను సిద్దం చేపించుకోండి. మీకు ఇష్టమైన ఆహారాలతోనే ప్రణాళికను సిద్దం చేసుకొని, పాటించండి.

ఏరోబిక్ కార్యాలు

ఏరోబిక్ కార్యాలు మంచి వినోదంతో పాటూ, కేలోరీలను తగ్గించి శరీరాకృతిని ఆకర్షణీయంగా మారుస్తాయి. రన్నింగ్, జంప్, రోప్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి కార్యాలు మంచి ఫలితాలను చేకూరుస్తాయి. కావున వివాహానికి నెల ముందు నుండి ఏరోబిక్ చేయటం అలవాటు చేసుకోండి.

స్వతహాగా ప్రేరేపించుకోండి

వివాహంలో మంచి ఆకృతి కనపడాలి అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంత సమయం ఉందో దాని గురించి ఆలోచించకండి. మంచి ప్రణాళిక తయారు చేసుకొని, దానిని అనుసరించటంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. మీరు ప్రేరేపితంగా ఉండటానికి మీ బరువు మరియు ఆకారాన్ని తరచుగా కొలుచుకుంటూ ఉండండి. త్వరగా ఫలితాలను పొందలేము కావున నిరాశకు గురి కాకుండా, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. సమయానికి అనుగుణంగా ఫలితాలు వాటంతట అవే వస్తుంటాయి.

ఎపుడైనా ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించండి

మీరు పాటించే జీవనశైలి ఆధారంగానే మీ ఆరోగ్యం, శరీర ఆకృతి ఉంటుంది. కావున ఎల్లపుడు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించండి; మంచి ఆహార ప్రణాళిక, వ్యాయామాలు, సరైన సమయం పాటూ నిద్ర వంటివి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. Image source: Getty Images