మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా?

0couples-imageకష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, మనస్పర్ధలు, అలకలు, అపార్ధాలు ఇవేవీ.. మీ వైవాహిక బంధాన్ని జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండనీయవు. కానీ మనసులో కలిగే కొన్ని భావనలు.. ఆనందాన్ని ఆవిరిచేస్తాయి. ఇద్దరి మధ్య బంధాన్ని బలహీనం చేస్తాయి.

కొన్ని సందర్భాల్లో భార్యా భర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు.. జీవితంపైనే విరక్తి తెచ్చేలా ఉంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. కాబట్టి.. మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా, జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే.. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. కొన్ని అలవాట్లు, ఆలోచనలను పక్కనపెడితే.. మీ మ్యారేజ్ లైఫ్ మీరు ఊహించిన దానికంటే హ్యాపీగా ఉంటుంది.

రివెంజ్

భాగస్వామి చేసే కొన్ని పనులు తీవ్ర కోపాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ కోపం రివెంజ్ గా మారే అవకాశాలుంటాయి. కానీ.. మీ లైఫ్ పార్ట్ నర్ పై పగలు, ప్రతీకారాలు పెంచుకోకూడదు. దీనివల్ల మీ హ్యాపీ లైఫ్ కాస్త మూడీగా మారిపోతుంది.

నిజాయితీ లేకపోవడం

ఒక అపద్ధానికి వంద జతచేయాల్సి వస్తుంది. కాబట్టి.. మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీ భాగస్వామికి చెప్పేయడం మంచిది. దాన్ని మీలోనే దాచుకోవడం లేదా అపద్ధం చెప్పడం వల్ల మీ రిలేషన్ కలకాలం హ్యాపీగా ఉండలేదు. నిజాయితీగా ఉన్నప్పుడు బంధం బలంగా ఉంటుంది.

స్వార్థం

ఏ రిలేషన్ లోనూ స్వార్థం మంచిది కాదు. తమ గురించి కాకుండా.. తమ భాగస్వామి గురించి కూడా పట్టించుకుంటూ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేర్ తీసుకోవాలి. స్వార్థంగా ఫీలైతే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా పెరుగుతాయి.

అసూయ

సంతోషాన్ని హరించేవాటిలో అసూయ ఒకటి. పైకి కనిపించకపోయినా.. ప్రవర్తన, మాటతీరుని బట్టి బయటపడుతుంది. ఇలాంటి ఆలోచనలు.. మీ మ్యారేజ్ లైఫ్ పై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి.. అసూయకి ఎంతదూరం ఉంటే అంత మంచిది.

భయం

మనల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసి, సంతోషాన్ని దూరం చేయడంలో ముందుంటుంది భయం. చిన్న చిన్న విషయాలకే భయపడటం, అనుకున్న పనులు జరగవేమో అన్న ఆందోళన వల్ల.. భార్యా భర్తల మధ్య ద్వేషం పెరుగుతుంది.