సెక్స్ సమయంలో స్త్రీలు కోరుకునేవి

0

telugu-couples-romance-picచాలా మంది మహిళలు భాగస్వామితో మనసు విప్పి సరదాగా మాట్లాడాలని అనుకుంటారు. మాట్లాడటం, ప్రేమను వ్యక్తపర్చడం అనేది ఆడవాళ్లకు ఎంతో ముఖ్యం. నడిచే సమయంలో, ఇద్దరూ కలిసి విశ్రాంతి తీసుకునేప్పుడు పార్టనర్ తమతో మాట్లాడాలని వాళ్లు కోరుకుంటారు. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పడం వల్ల అనుబంధం మరింత బలపడుతుందట. చాలా కాలంపాటు కలిసే ఉండటం వల్ల తమ భాగస్వామికి తనంటే ఇష్టం తగ్గిందేమో అని మగువలు అనుమానిస్తారు. కానీ ఆ మాటను బయటపెట్టరు. ఈ విషయాన్ని మగాళ్లే గుర్తించి వారి అనుమానాన్ని తుడిచేయాలి. ఆమె అందంగా ఉందని పొగడక్కర్లేదు.. అలాగనీ నీ ముఖం చూడబుద్ధి కావట్లేదు అనేలా అసహ్యించుకోవద్దు కూడా. కాకపోతే అప్పుడప్పుడూ ఆమెను కాస్త ప్రశంసిస్తే సరి.

మహిళలతో దురుసుగా మాట్లాడటం, తిట్టడం, హర్టయ్యేలా చేయడం లాంటివ చేయకూడదు. శృంగారం సమయంలో ఆమెతో సరదా గడపడంతోపాటు ఉత్సాహంగా ఉండాలి. ఆ సమయంలో ఆడవాళ్లకు మంచి ఫీలింగ్స్, అనుభూతి అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

తమ భార్యను శృంగారంలో పతాక స్థాయికి తీసుకెళ్లాలని చాలా మంది పురుషులు భావిస్తారు. అది మంచిదే కాకపోతే.. ప్రతిసారి తప్పనిసరేం కాదు. భావప్రాప్తికి చేరుకునే విషయంలో చాలా మంది ఆడవాళ్లు తమ భాగస్వామి నుంచే కాకుండా తమలో తాము ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు భావప్రాప్తికి బదులు వాళ్లు ఫోర్‌ప్లేను కోరుకుంటారు.

భాగస్వామితో చక్కటి శృంగారంలో పాల్గొనడం అనేది ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇది మంచిది కూడా. చాలా మంది మగాళ్లు సెక్స్ విషయంలో, ఇతర సందర్భాల్లోనూ ఎక్కువ సీరియస్‌గా ఉంటారు. కానీ జోవియల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే చాలు ఆడవాళ్లు హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల కలయిక సమయంలో ఇద్దరిపై ఒత్తిడి ఉండదు.

ఆడవాళ్లు రొమాన్స్‌ను, కౌగిలింతను, చేతిలో చేయి వేసి ఉంచుకోవడాన్ని, ముద్దు పెట్టుకోవడాన్ని మగువలు ఇష్టపడతారు. ఫోర్‌ప్లే సమయంలో తమ భాగస్వామి ఇవేవీ చేయడం లేదని చాలా మంది మగువలు ఫిర్యాదు చేస్తుంటారు. స్పర్శలో ఉండే అనుభూతిని మహిళలు గుర్తించాలి. రిలాక్సింగ్ మసాజ్ చేయడం, జుట్టును, ముఖాన్ని చేతితో మృదువుగా తాకడం వల్ల ఫలితం ఉంటుంది. అతడు మీ స్పర్శను కచ్చితంగా ఆనందిస్తాడు. అలాగే మీ భాగస్వామి నుంచి మీరేం కోరుకుంటున్నారో చెప్పండి మంచిది.

శృంగారంలో పాల్గొన్న వెంటనే పురుషులు నిద్రకు ఉపక్రమిస్తారు. శరీరంలో ఎండార్ఫిన్లు ఎక్కువ మోతాదులో విడుదల కావడమే ఇందుకు కారణం. వీర్య స్ఖలనం అయ్యాక అంగం మెత్తబడటమే కాకుండా అతడు విశ్రాంతిని కోరుకుంటాడు. కానీ మహిళలు ఇలా కాదు. వారిలో భావప్రాప్తి ఒకేసారి కలగదు. అది కొద్దికొద్దిగా పెరుగుతూ వెళ్తుంది. మీకు మీ పార్టనర్ అలా వెంటనే నిద్రపోవడం నచ్చకపోతే.. ఆ విషయం తనతో చెప్పండి. లేదంటే కాసేపు మీ చేతుల మీద అతడ్ని నిద్రపోనిచ్చి తర్వాత మెల్లగా నిద్రలేపండి