ప్రేమికుల ముద్దుల్లో రకాలు!

0

types-of-kissingsముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు. ముద్దు గొప్పతనం గురించి ప్రేమికులకు తెలుసు. ముద్దులోని రకాల గురించి మనం ఒకసారి ముచ్చటించుకుందాం. భారతీయ సంప్రదాయంలో ముద్దు అనేది వ్యక్తిగత వ్యవహారం. ప్రేమికులు, భార్యాభర్తల చుంబనం చాలా రహస్యంగా ఉంటుంది. మన సంస్కృతి మనకు నేర్పిన క్రమశిక్షణ అది. మనవాళ్లలో చాలామంది ముద్దును అందరూ లవర్‌ నుదటి మీద పెట్టుకుంటుంటారు. ఇక ఫ్రెంచ్‌ కిస్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది రొమాంటిక్‌ నేచర్‌. తొలిసారి ఫ్రెంచ్‌ వాళ్ళు కనిపెట్టిన ఫ్రెంచ్‌ కిస్‌ ముద్దులన్నింటిలోకి పాపులర్‌. ఎంతో ఇంటిమసీ ఉంటే తప్ప పెట్టుకోలేని ముద్దు ఇది. పెదాల మీద పెదాల ఆన్చి కిస్‌ మొదలు పెట్టాలి. మీరు తన్మయంలో ఉండగానే మీ నాలుకను మీ లవర్‌ నాలుకతో కలపండి. నాలుకలు పెనవేసుకొన్న వేళ ఫ్రెంచ్‌ కిస్‌ గొప్పదనం ఏమిటో మీకు తెలుస్తుంది.

అలాగే సింగిల్ లిప్ కిస్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. కేవలం ముని పెదాలను మాత్రమే కిస్ చేయడం ఇందులోని స్పెషల్. ప్రేమకు గుర్తుగా ప్రేమికులకు ఈ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇక లిజ్జి కిస్ కూడా లవర్స్ కు ఇష్టమైన ముద్దు. దీన్నే లిజార్డ్స్ కిస్ అని పిలుస్తారు. ఈ ముద్దు పెట్టుకున్నప్పుడు నాలుక నోటిలోపల బయట స్టిక్కీగా ఉంటుంది. అందుకే పార్ట్నర్ కు ఇచ్చే మధరమైన కిస్ గా దీన్ని చెప్పుకుంటారు. అలాగే లిప్ టు లిప్ కిస్ కూడా ప్రేమికులకు ఎంతో మంచి అనుభూతిని ఇస్తుంది. చాలా సమయంపాటు భావోద్వేగంతో చుంబించడమే ఈ కిస్ స్పెషల్.

అలాగే ఎయిర్ కిస్ కు ఒక ప్రత్యేకత ఉంది. దీన్నే ఫ్లయింగ్ కిస్ అని అంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ ఇస్తున్నట్టుగా గానీ ఈ ముద్దును ఇస్తారు. హ్యాండ్ కిస్ అనేది పలకరింపు ముద్దు. ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఈ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. చేతిని అందుకుని వెనక్కి తిప్పి ముద్దు పెడుతుంటారు. ఇది అవతలి వ్యక్తిపై మీ గౌరవాన్ని తెలుపుతుంది. చీక్ కిస్ అనేది మరీ కొత్తవారిని కాకుండా, బాగా పరిచయం ఉన్న వారిని, అభిమానించేవారి చెంపలపై ముద్దాడుతాం. ఇక మీ ప్రేయసి ముక్కుకు మీ ముక్కును రాస్తూ చుంబించడమే ఎస్కిమో కిస్. జాలైన్ కిస్ అనేది ఎవరైతే చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారికి ఇస్తుంటారు. జాలైన్ (దవడ)వద్ద ఇచ్చే కిస్ ఇది. అయితే ఇప్పుడిప్పుడే ప్రేమయాత్రను ప్రారంభించిన వారు హ్యాండ్ కిస్‌తోనో, ఫోర్‌హెడ్ కిస్‌తోనో మొదలుపెడితే బెటర్. బంధం బలపడేవరకూ ఫ్రెంచ్ కిస్ జోలికి వెళ్లొద్దు. మొదటికే మోసం రావచ్చు సుమా.