ఏకాంత వేళ ఆమెతో ఎలా ఉండాలి?

0


Sleepingవైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే శృంగారం ఎంతో అవసరం. ఆడవాళ్లు సహజంగానే సున్నిత మనస్కులు. ఏ విషయంలోనైనా వారితో కాస్త సుతిమెత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఇద్దరూ ఏకమయ్యే వేళ.. తనతో మృదువుగా మాట్లాడాలి. మొరటుగా వ్యవహరించకుండా.. సుతారంగా తడమాలి.. సెక్సాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. శృంగారానికి సిద్ధపడుతున్న వేళ.. మగువతో ఎలా వ్యవహరించాలనే విషయమై సెక్సాలజిస్టులు నిర్వహించిన అధ్యయనాన్ని ‘ది సన్’ ప్రచురించింది. దీని ప్రకారం.. చక్కటి మూడ్‌లో ఉన్నప్పుడు చిలిపిగా మాట్లాడుకోవాలి. అంతే కానీ కొన్ని విషయాల జోలికి మాత్రం అసలే వెళ్లొద్దు.

ఏకాంతంగా గడిపే సమయంలో కొన్ని అంశాలను అసలు ప్రస్తావించొద్దు. గతంలో ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందేమో అనే దిశగా ఆరాలు తీయడం ఏ మాత్రం మంచిది కాదు. పార్టనర్‌తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ గత అనుభవాలను వివరించడం లేదా ఆమె అనుభవాల గురించి వివరాలు అడగటం చేయొద్దు. ఇలా చేశారో ఆమె మూడ్ దెబ్బతిని.. మీ నుంచి దూరంగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

ఆ వేళలో మహిళల వద్ద ప్రస్తావించకూడని మరో అంశం పోర్నోగ్రఫీ. ఇదంతా కల్పితమైంది. పోర్న్ వీడియోల్లో చూపించే ప్రయోగాలు చేద్దామని బలవంతం చేయొద్దు. అలాంటి ప్రయోగాలను చేయడం గురించి ఆమె వద్ద ఒత్తిడి చేయొద్దు. ఆ టైంలో పార్టనర్ మృదువుగా వ్యవహరించాలని మెజారిటీ మహిళలు కోరుకుంటున్నారు.

ఆమెకు కష్టం అనిపించే, నచ్చని భంగిమల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆమె నో అంటనే ఎస్ అని ఎంత మాత్రం కాదు. అంతటితో వదిలేయడం మంచిది. అలా కాకుండా బలవంతపెడితే.. ఆమె హర్ట్ అవుతుంది.

బెడ్ మీద ప్రస్తావించకూడని మరో అంశం ‘ఇక చాలా..’ అనే మాట. శృంగార ప్రక్రియను ముగించాలి అనుకున్నప్పుడు కొందరు పురుషులు ఇలాంటి ప్రశ్న వేసే అవకాశం ఉందని, పొరపాటున కూడా అలా అడగొద్దు.. ఈ మాట అపార్థానికి దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.