లైంగిక సామర్ధ్యంపై యువతకు అపోహలు..!!

0


doubts on potencyఈ మద్య కాలంలో యువతకు తమ లైంగిక సామర్ధ్యంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మగవాళ్ళు సెక్స్ కోర్కెలు తగ్గడానికి డిప్రెషన్, డిప్రెషన్ కు వాడే మందులు, అలాగే అధికరక్తపోటు, అధికరక్తపోటుకు వాడే మందులు మాత్రమే కాక అనేక శారీరక, మానసిక, జీవరసాయన కారణాలుంటాయి. ఇలాంటివి కలిగినప్పుడు దేనివలన భర్తకు సమస్య కలిగిందో గుర్తించడం, చికిత్సకు మార్గాలన్వేషించడం చికిత్సాకాలంలో సహకరించడం భార్యకు అత్యంత అవసరం.
కొన్ని రకాలైన విధానాలు సహజమైనవే అయినప్పటికీ వాటిని అసహజమైనవిగా భార్యలు భావిస్తుంటారు.పెళ్ళయిన కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మగవాడి సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
భర్తతో అనుబంధం పెరిగేకొద్దీ భార్య ఇన్హిబిషన్స్ అన్నీ వదులుకొని శృంగారంలో ఉత్సాహంగానూ, చురుగ్గానూ పాల్గొనగలుగుతుంది. మగవాడి విషయంలో రోజువారీ ఆందోళనలు, పనివత్తిడి, ఆర్ధిక ఇబ్బందులు సెక్స్ ను తగ్గిస్తాయి. కొందరు ఇంటికి వచ్చాక కూడా వృత్తికి సంబంధించినవే ఆలోచిస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు భార్య సహకారం మరింత అవసరమవుతుంది.