అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారా…?

0


అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడటం జరుగుతుంది. అంగంలోకి రక్తప్రసరణ జరగపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.

అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు. మానసిక ఆందోళన ఒత్తిడి, భయం, డిప్రెషన్, పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్ సామర్థ్యం పైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువుగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.