వర్షంలో గడిపే రొమాంటిక్ లైఫ్

0

romance-in-rainఅసలే వర్షాకాలం.. అందులో ఆ రోజు ఆఫీసులో మీ వీక్లీ ఆఫ్. ఒకవైపు బయట చిన్నగా కురుస్తోన్న చినుకులు.. మరోవైపు మీ లైఫ్ పార్టనర్ తో మీరు గడిపే క్షణాలు.. ఎవరికీ అందని ఆనందతీరాలు మీవి. వాటిని రాతల్లో, మాటల్లో వర్ణించలేము. అయితే మీ జాలీ డేను కాకుండా కాస్త డిఫరెంట్ గా గడిపేందుకు ట్రై చేయండి. కొన్నిసార్లు, పరిమితులు దాటి గడపడంలో ఉండే థ్రిల్లే వేరు. దీంతో మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది. చినుకులు చిన్నగా పడుతుంటే ఇద్దరూ కలిసి బైక్ మీద ప్రయాణించండి. ఈ జర్నీ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే ఇద్దరికీ నచ్చిన ఒక రొమాంటిక్ సినిమాను ఇంట్లో ఏకాంతంగా చూడండి. మూవీని ఏదో కుర్చీలో, సోపాలో కూర్చొని మాత్రం చూడకండి. రొమాంటిక్ గా ఇద్దరు పక్కపక్కనే ఉండి, ఒక పక్క పాప్ కార్న్ రుచి చూస్తూ అందులో ఉన్న ఫీల్ ను అనుభవించండి.

మేఘాలు భావోద్వేగాలను తీసుకువస్తాయి. మీ వైఫ్ తో కలిసి మేఘాలను చూడండి. మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి వంట చేస్తే అందులో వచ్చే థ్రిల్లే వేరబ్బా. మీ భార్యతో పాటు వంటిట్లోకి వెళ్లి వేడివేడిగా టీ తయారుచేయండి. ఇద్దరూ కలిసి ఆ టీని రొమాంటిక్ గా సిప్ చేస్తుంటే అప్పుడొచ్చే మజానే వేరు. క్యాండిల్ లైట్ వెలుగులో డిన్నర్ ప్లాన్ చేయండి. మీరిద్దరూ ఆనందంగా గడపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కొంటెగా ఉంటే, మీరు చేయటానికి కొన్ని కొంటె పనులు ఉన్నాయి. మీ ఇద్దరికీ అలసట వచ్చే వరకు దిండ్లతో రొమాంటిక్ గా కొట్టుకోండి. ఇలా రోజంతా ఫుల్ ఎంజాయ్ గా గడిపిన తర్వాత ఆ ఆనందంలో అలసి పోతారు. ఇద్దరూ కలిసి ఒక కునుకు తీయండి.