ఇలా ప్రపోజ్ చేస్తే మీ లవ్ సక్సెస్!

0


propose-to-a-girlమరి కొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే. వన్ సైడ్ లవ్ చేసే అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్‌కు ఎలా ప్రపోజ్ చేయాలా అని తెగ ఇదై పోతుంటారు. ఎంతలా ఆమెను ఆరాధిస్తున్నామనేది కాదు.. ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయవంతం అయితేనే ప్రేమ పట్టాలెక్కుతుంది. వన్ సైడ్ లవ్ కాస్తా.. ఇరువురు మనసులు కలిసే దాకా వెళ్లాలంటే.. ప్రేయసిని ఆకట్టుకునే రీతిలో ప్రపోజ్ చేయడం ఎంతో ముఖ్యం. ఇంతకూ ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో కండి..

* మీరు మీలాగే ఉండటం చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తించండి. మిమ్మల్ని మీలాగే ఆ అమ్మాయి అంగీకరించాలి. తనతో ప్రేమ విషయం మాట్లాడేటప్పుడు కంగారు పడకండి. కూల్‌గా, ఆకట్టునేలా మాట్లాడేందుకు ప్రయత్నించండి.

* అమ్మాయి ఎదురుగా మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేయడం అనేది పాత పద్ధతే కావచ్చు కానీ.. ఇలా చేయడం వల్ల మీరు తప్పకుండా ఆమె మనసు మాత్రం గెలుచుకోగలరు. మీరలా.. మోకాళ్లపై నిలబడి ఎర్ర గులాబీతో మీ ప్రేమను వ్యక్తపరిస్తే.. అమ్మాయి ఫ్లాటై పోవడం ఖాయం.

* కుదిరితే తనను డిన్నర్‌కు తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల తను స్పెషల్‌గా ఫీల్ అవుతుంది. ఆహ్లాదకరమైన సంగీతం వస్తున్నప్పుడు.. తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయండి. డిన్నర్ తర్వాత మెల్లగా ప్రేమ విషయాన్ని బయటపెట్టండి.

* ఆమె ఇంటి ముందు లేదా పని చేసే చోట మీ ప్రేమ సందేశంతో కూడిన బ్యానర్‌ను ఉంచండి. కానీ ఓ విషయం.. ఆమె పేరును మాత్రం అందులో వాడకండి. ఆమెను మీరు ముద్దుగా ఏమని పిలుస్తారో ఆ పేరే రాయండి.

* మీరు తొలిసారిగా ఎక్కడ కలిశారో ఆ ప్రదేశానికి తీసుకెళ్లండి. అలా చేస్తే తను తప్పకుండా సర్‌ప్రైజ్‌గా ఫీల్ అవుతుంది. తన నుంచి కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

* మీకు డబ్బు సమస్య లేకపోతే.. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో నితిన్ రేంజ్‌లో మీ బంగారం కోసం ఆకాశంలో హెలీకాఫ్టర్ ద్వారా ప్రేమను అక్షర రూపంలో వెల్లడించండి. ఆమె మిమ్మల్ని ఇష్టపడుతోందని కచ్చింతంగా ఫీలైనప్పుడు మాత్రమే ఇలా చేయండి లేకపోతే.. ఆ డబ్బంతా వృథా అవుతుంది.

* మీరు అపార్ట్‌మెంట్లో ఉంటుంటే.. మీ ఇరుగుపొరుగు వారిని రిక్వెస్ట్ చేసి ‘I Love You’ అనే అక్షరాలు మాత్రమే కనిపించేలా వాళ్లను లైట్లు ఆర్పమనండి. తర్వాత ఆమె కళ్లను మూసి బాల్కనీలోకి తీసుకెళ్లి మీ మనసులోని మాటలను ఆమెకు చూపించండి. ఆమె తప్పకుండా ఇష్టపడుతుంది.

* సూర్యాస్తమయానికి ముందు తనను బీచ్‌కు తీసుకెళ్లండి. కారులో చక్కటి మ్యూజిక్ ప్లే చేసి.. ఆమె సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న వేళ మీ మనసులోని మాటను ఆమెకు చెప్పేయండి.

* మీతోపాటు ఆమె కూడా సాహసాలను ఇష్టపడే రకమైతే.. సమీపంలోని హిల్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లండి. సూర్యోదయానికి ముందే కొండ శిఖరానికి చేరుకొని.. సూర్యోదయం అవుతున్న వేళ.. ఎత్తయిన ఆ శిఖరం మీద.. మోకాళ్లపై నిలబడి తనకు ప్రపోజ్ చేయండి. ఆమె మీకు పడిపోవడం ఖాయం.

* కాస్త డ్రామటిక్‌గా ప్రపోజ్ చేయాలనుకుంటే.. వాటర్ గన్ తీసుకొని ఆమెకు గురిపెట్టండి. నా హృదయాన్ని దొంగిలించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటూ వెరైటీగా ఆమెకు ప్రపోజ్ చేయండి.

* ఇక ఆమెతో నేరుగా విషయం చెప్పడానికి మొహమాటం ఎదురైతే.. ప్రేమలేఖ ద్వారా మీ మనసులోని భావాలను ఆమెకు తెలియజేయండి. ఈ లెటర్‌ను ఫ్రెండ్స్ ద్వారా తనకు చేర్చడం కాకుండా నేరుగా తనకే అందించండి.