హస్త ప్రయోగంతో స్వయంతృప్తి ఆరోగ్యానికి హానికరమా?

0


unhappy-menప్రశ్న: నా వయస్సు 26 ఏళ్లు. ఇప్పటివరకు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు కానీ గత 16 ఏళ్లుగా దాదాపు రోజుకు రెండుసార్లు హస్త ప్రయోగంతో స్వయంతృప్తి పొందుతున్నాను. హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదేనా ? ఇప్పుడు నేనో సమస్యతో బాధపడుతున్నాను. హస్త ప్రయోగం సమయంలో కాళ్ల నొప్పులు, కిడ్నీలు వుండే చోట నొప్పి కలుగుతోంది. ఇదంతా చూస్తోంటే ఇప్పుడు ఆరోగ్యరీత్యా చికిత్స తీసుకోవాల్సిన అవసరం వుందా అనే సందేహం కలుగుతోంది. అంతేకాకుండా శృంగార సామర్థ్యాన్ని సైతం పెంపొందించుకోవాలి. నేనే ఏం చేయాలో చెప్పండి!

జవాబు : హస్త ప్రయోగంతో ఏ సమస్య వుండదు.. కాకపోతే దానినే ఓ అలవాటుగా మార్చుకోకండి. ఇప్పటికే అలవాటైపోయిందంటున్నారు కాబట్టి ఇకనైనా మీ అలవాటుని మార్చుకుని అంగస్తంభనలు కలిగినప్పుడు మాత్రమే హస్త ప్రయోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చెబుతున్న లక్షణాలనిబట్టి అవి శారీరకమైన ఆరోగ్య సమస్యలే అయ్యుండవచ్చు అనిపిస్తోంది. అందుకే డాక్టర్‌ని సంప్రదించి వారి సలహా ప్రకారం చికిత్స తీసుకోండి.