మా ఆయన నా చెల్లికి అట్రాక్ట్ అయ్యారు

0


my-husband-is-attracted-toప్రశ్న: నేను 30 ఏళ్ల వయసున్న వివాహితను. కొద్ది కాలం కిత్రం మేం ఉండే సిటీలోనే మా చెల్లికి జాబ్ రావడంతో మా ఇంటికి వచ్చింది. ఇప్పటికే ఆరు నెలలు గడిచాయి. తన పెళ్లయ్యే వరకూ నా దగ్గరే ఉంచుకుందామని అనుకుంటున్నాను. కానీ ఓ రోజు నా భర్త వచ్చి.. మీ చెల్లిని వేరే చోటకు పంపించు. నేను తనకు అట్రాక్ట్ అవుతున్నా అన్నాడు. తనకు అలాంటి ఆలోచనలు వస్తున్నందుకు క్షమాపణ చెప్పాడు. తాను దూరంగా ఉంటే మంచిదని చెప్పేశాడు. అప్పటి నుంచి మా చెల్లి వేరే దగ్గర ఉంటోంది. కానీ ఈ ఘటన మా వివాహ జీవితంపై ప్రభావం చూపింది. ఆయన్ను నేను క్షమించలేకపోతున్నాను. మా ఆయన ఎప్పుడూ నా చెల్లితో చెడుగా ప్రవర్తించకపోయినప్పటికీ, ఆమెతో హుందాగా వ్యవహరించినప్పటికీ ఆయన క్యారెక్టర్ మంచిది కాదనే అభిప్రాయం కలుగుతోంది. మా బంధం బలహీనపడుతోంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

జవాబు: మీరు ఈ ప్రశ్న అడిగి మంచి పని చేశారు. మీలో మీరు బాధపడితే ఎలాంటి ప్రయోజనం ఉండేద కాదు. విషయానికి వస్తే.. ముందుగా మీరు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మీ భర్త తన ఆలోచల్ని మీతో చెప్పి మంచి పని చేశారు. ఎలాంటి తప్పు జరగకుండా ముందే మిమ్మల్ని హెచ్చరించారు. అతడికి మీ సాయం అవసరం. ఆయన ఎంతో ధైర్యంగా మీతో నిజం చెప్పాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. మీలో ఆందోళన, భయం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆయన తన భావాలను మాత్రమే చెప్పారు. వాటితో మీ బంధానికి ముప్పు అని భావించొద్దు. నిజానికి ఈ విషయం చెప్పినందుకు మీరు మీ భర్తను ప్రశంసించాలి. ఆయన చెప్పడం వల్లే కదా.. మీ చెల్లిని వేరే చోటుకి మార్చారు. కాబట్టి మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. అతణ్ని నిందించడం మానండి. ఏ బంధానికైనా నమ్మకం, సర్దుకుపోవడం ముఖ్యం.

మీరు మీ భర్త నిజాయతీని ప్రశంసించడంతోపాటు మీ భావాలను కూడా ఆయనతో పంచుకోండి. అప్పుడు మీరు తప్పకుండా మీ పొరబాట్లను దిద్దుకోగలరు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఆయనతో మాట్లాడండి. మీకే పరిష్కారం లభిస్తుంది. తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చే ముందు , ఆయన ఇది అని ముద్ర వేసే ముందు మిమ్మిల్ని మీరు ప్రశ్నించుకోండి. మరోసారి ఆలోచించుకోండి. మీరు జీవితాన్ని పాజిటివ్‌గా గడపడానికి, సర్దుబాటు కావడానికి కౌన్సెలింగ్ అవసరం. కాబట్టి నిపుణులైన సైకాలజిస్టును సంప్రదించండి.