మనుషుల్లాగే ఉండే సెక్స్ రోబోలు వస్తున్నాయి

0Sex-Robotsరోబో సినిమాలో రోబో మనిషిని ని ప్రేమించడం, ఐశ్వర్యతో రోమాన్స్ చేయాలనుకోవడం చూపించిన శంకర్ ని అప్పట్లో చాలామంది సినీవిమర్శకులు విమర్శించారు. రోబో ఎలా ప్రేమిస్తుందని, రోబో మనిషితో సంభోగం చేయాలనుకోవడం ఏంటని తమ పెన్ను పవర్ చూపించారు. కాని శంకర్ చూపించిందే నిజం కాబోతోంది.

త్వరలోనే రోబోలతో మనుషులు సెక్స్ చేయడం ఈ ప్రపంచం చూడబోతోందని సైంటిస్టులు చెబుతున్నారు. మనిషి చర్మాన్ని తాకినట్లే ఉండే ఔటర్ ఫేస్ తో సెక్స్ రోబోట్స్ రాబోతున్నాయట. మనుషుల ప్రేమ దక్కని ఒంటరి మనుషులకి ఇవి నేస్తాలుగా మారుతాయని, వారిని ప్రేమిస్తాయని, వారితో సరసాలు ఆడుతాయని చెబుతున్నారు రోబోటిక్స్ ఎక్స్ పర్ట్స్.

వినడానికి వింతగా ఉన్నా, ఈరోజుల్లో సైన్స్ చేయలేని పని లేదుగా. ఇప్పుడు చెబుతున్న విషయాలు కూడా చేసి చూపెడతారేమో. ఇప్పటికే మొబైల్, టీవిలకు అతుక్కుపోయి, మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. రేపు ప్రేమను, శృంగారాన్ని అందించే పరికరాలు కూడా వస్తే, మనుషులు మధ్య దూరం ఇంకెంత పెరిగిపోతుందో .. సృష్టి ఎటువైపు వెళుతుందో!