అతిగా సెక్స్ చేస్తే.. వచ్చే అనర్థాలివే!

0side effects of too much enjoymentప్రాచీన మత గ్రంథాలు కేవలం ఆధ్యాత్మికత గురించి మాత్రమే కాదు సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలనే అంశాలను కూడా వెల్లడించాయి. విష్ణు పురాణం ప్రకారం జీవితం హ్యాపీగా గడిచిపోవాలంటే కింద పేర్కొన్న అయిదు అంశాలను అతిగా చేయకూడదు. ఈ అలవాట్ల కారణంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట. కాబట్టి ఈ అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంతకూ ఆ విషయాలు ఏవో చూద్దాం..

* అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదట. సెక్స్ చేయడం వల్ల ఆతురత తగ్గి, మంచి మూడ్ వస్తుంది కానీ అతిగా సెక్స్ చేయడం మాత్రం అనర్థం. ఆధునిక పరిశోధనల్లోనూ ఇది నిజమని తేలింది. అధికంగా సెక్స్ చేయడం వల్ల బట్టతల రావడం, కంటి చూపు దెబ్బతినడంతోపాటు కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎటాక్ కూడా వచ్చే అవకాశం ఉందట.

ఎందుకంటే.. శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ (డీహెచ్‌టీ) అనే హార్మోన్ స్థాయులు అధికం అవుతాయి. ఈ హార్మోన్ కారణంగా జుట్టు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశాలు పెరుగుతాయట. అంతే కాకుండా కంట్లో ఉండే రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి కంటి చూపు మందగిస్తుందట.

* శ్మశానానికి సమీపంలో నివసించే వారిలో కూడా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట. శవాలను దహనం చేసినప్పుడు వెలువడే వాసనలు మనపై ప్రభావం చూపుతాయట.

* కూల్ డ్రింకులను అతిగా తాగడం అనేది మంచి అలవాటు కాదు. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయట. అందుకే కూల్ డ్రింక్స్ తాగే బదులు రోజూ 8 గ్లాసుల మంచి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది

* ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధ పడుతుండటం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలు రావడానికి దోహదం చేస్తుంది. ‘సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి ఏదైనా చేయగలం అంటే.. బాధపడటం అనవసరం. అలాగే.. ఏం చేయలేకపోతున్నా, దానికి సమాధానం మన దగ్గరలేకున్నా బాధపడటం వల్ల ప్రయోజనం లేదు’ అన్న దలైలామా మాటలను గుర్తుంచుకోవాలి.

* రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రించడం వల్ల కూడా వయసు మీద పడిన వారిలా కనిపిస్తారు. రోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. సరిపడా నిద్రలేకపోవడం, అర్ధ రాత్రి దాకా మెలకువతో ఉండటం వల్ల బాడీ సైకిల్ దెబ్బతింటుంది. దాని ప్రభావం శరీరంపై తప్పక పడుతుంది.

* మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం వల్ల కూడా ముఖంపై త్వరగా ముడతలు వస్తాయి. ఈ అలవాట్ల కారణంగా ఒంట్లో విష పదార్థాల అవశేషాలు పేరుకుపోతాయి. ఫలితంగా మొహం కాంతి విహీనం అవుతుంది. శారీరక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.