పురుషాంగం పరిమాణాన్ని పెంచుకోవచ్చా?

0

size-myths-you-need-to-knowయుక్త వయస్కుల్లో చాలా మందికి తమ పురుషాంగం గురించి అనేక అనుమానాలు, అపోహలు ఉంటాయి. కానీ వారు ఈ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. దీనిక కారణం బిడియమే. పురుషాంగం పెద్దగా ఉంటే ఆడవాళ్లను ఎక్కువగా శాటిస్ఫై చేయవచ్చని కొందరు భావిస్తుంటారు. ఓ హెల్త్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం 52 శాతం మంది తమ పురుషాంగం మరింత పొడవుగా ఉంటే బాగుండు అని అనుకోగా.. 34 శాతం మంది అది మరింత లావుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారట. కానీ వాస్తవానికి పురుషాంగం పొడవు ఎంత ఉందనే పెద్ద విషయమేం కాదు.

పురుషాంగం ఎంత పెద్దదిగా ఉంటే ఆడవారిని అంతగా సంతృప్తి పర్చవచ్చని చాలా మంది మగాళ్లు భావిస్తుంటారు. కానీ పురుషాంగం పరిమాణం కంటే అనేక ఇతర అంశాలే ఈ విషయంలో ముఖ్యమైనవి. అంతేగానీ అంగం సైజ్ అనేది పెద్ద విషయం కాదు. మరీ పెద్ద అంగం ఉన్నవారితో సంభోగం చేసే సమయంలో ఆడవాళ్లు ఇబ్బందికి గురవుతారు. పురుషాంగం పరిమాణం పెద్దగా ఉన్నకొద్దీ దాని పట్ల ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.

పురుషాంగం పరిమాణం కంటే వెజీనానే పెద్దదిగా ఉంటుందని చాలా మంది భ్రమిస్తుంటారు. అలాగే ఉండాలని రూలేం లేదు కానీ.. పురుషాంగం పరిమాణాన్ని బట్టి వెజీనా కొద్దిమేర సాగుతుంది. కొన్ని సందర్భాల్లో వెజీనా కంటే అంగం పొడవే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. వెజీనా నుంచి తగిన మోతాదులో స్రావాలు వెలువడకపోవడం, శృంగారానికి సదరు స్త్రీ పూర్తిగా సమాయత్తం కానప్పుడు మాత్రం అంగప్రవేశం కష్టం అవుతుంది.

పొడవైన పురుషాంగం ఉన్నప్పటికీ.. మహిళల భావప్రాప్తి విషయంలో ఎలాంటి తేడా లేదని ఓ అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా భావప్రాప్తి చేరడం కాస్త కష్టమైందని కూడా వారు చెప్పారు. ఆడవారిలో జననాంగ భాగాల్లో లోపలి కంటే ఎక్కువగా నరాలు బయటి ప్రాంతంలోనే ఎండ్ అవుతాయి. కాబట్టి.. అంగం మరీ పెద్దగా ఉన్నంత మాత్రాన వారికి వచ్చే ప్రయోజనమేమీ లేదు.

గట్టిపడిన అంగం ఏడు అంగుళాలు ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అందులో వాస్తవేం లేదు. ఒక వెబ్‌సైట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతీయ పురుషుల అంగం పరిమాణం చిన్నదని తేలింది. సగటున దాని పొడవు కేవలం 4 అంగుళాలు మాత్రమే. వెనిజులా పురుషుల అంగం అందరి కంటే పొడవైంది. కానీ వారి అంగ పరిమాణం కూడా సగటున 6.7 అంగుళాలు మాత్రమే.

షూ సైజ్‌ ఎక్కువగా ఉంటే.. అంగం పొడవు ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇదంతా ఉత్తిదేనని లండన్‌కు చెందిన రెండు పరిశోధనలు వెల్లడించాయి. ఇందుకోసం వారు 104 మంది పురుషుల అంగం, షూ సైజ్‌లను తీసుకొని అధ్యయనం చేపట్టారు. దాని ప్రకారం ఈ రెండింటి మధ్య ఏ సంబంధం లేదని తేలింది.

మీ అంగ పరిమాణం పెంచుకోవడానికి మేం మందులు ఇస్తాం. మా దగ్గరున్న టెక్నిక్‌తో అంగం పొడవును పెంచుకోవచ్చంటూ చాలా ప్రకటనలు ఊదరగొడుతుంటాయి. మరి వాటిలో నిజమెంతా అంటే… అంతా ఉత్తిదే. అంగ పరిమాణం పెరగాలంటే సర్జరీ ఒక్కటే మార్గం. సర్జరీ లేకుండా అంగం సైజ్ పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక అంగం ఎక్కువ సేపు గట్టిపడాలంటే.. అందులోకి రక్త సరఫరా ఎక్కువగా ఉండటం ముఖ్యం. వయాగ్రా లాంటి వాటి వల్ల అంగంలోకి రక్త సరఫరా మెరుగుపడి.. అంగం ఎక్కువ సేపు గట్టిపడుతుంది. కానీ అదికూడా ఆ కాసేపే.