పటికబెల్లం కలిపిన పాలు తాగితే వీర్యశక్తి వృద్ధి!

0

woman-with-milkఆవుపాలతో – అఖండయవ్వనం “పయ: పీత్వాస్త్రియంగచ్చేత్ స్త్రియం గత్వా పయ: పిబేత్” అని ఆయుర్వేద మహర్షులు హితోక్తి పలికారు.ఆ హితోక్తికి అర్ధం తెలుసుకుంటే మన సంసార జీవనరధం నల్లేరుపై బండిలా సక్రమంగా సాగిపోతుంది. గోరువెచ్చని పాలల్లో తగినంత పటికబెల్లంపొడి కలిపి ఒక గ్లాసుడు మోతాదుగా తాగిన తరువాతే పురుషుడు స్త్రీ సంభోగంలో పాల్గొనాలి.అదేవిధంగా సంయోగ కార్యక్రమం ముగిసిన తరువాత కూడా వెంటనే పైన తెలిపిన మోతాదులో పాలు తాగాలి. ఇదే హితోక్తికి అర్ధం.

పురుషునిలో వీర్యశక్తి లోపిస్తే ఏమౌతుంది?

పురుషుడి శక్తిసామర్ధ్యాలు,జీవనవిజయాలు మొదలైనవన్నీ అతని “వీర్యపటుత్వం”మీదనే ఆధారపడివుంటాయి.ఎంతకాలం పురుషుడిలో వీర్యశక్తి సన్నగిల్లకుండా వుంటుందో అంతకాలం అతడు ధైర్యంతో,సాహసంతో ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదిరించి కుటుంబాన్నిసమర్ధవంతంగా పోషించగలుగుతాడు.

అంతేగాక ఇంట్లో భార్యవద్దగానీ,వృత్తిలో పోటీదారులముందుగానీ,సంఘంలో పదిమంది ప్రజలముందుగాని గౌరవమర్యాదలు కడదాకాపొందాలంటే ఓజస్సుకు తేజస్సుకు ప్రతిరూపమైన వీర్యశక్తి పురుషునిలో పుష్కలంగా వుండితీరాలి.

నపుంసకత్వమే-పురుషులకు అపజయం.

ఇంతటి మహత్తరమైన వీర్యశక్తి, వీర్యపటుత్వం తగ్గిననాడు ఆ క్షణం నుండే పురుషునిలో శారీరకంగా మానసికంగా ఆత్మన్యూనతాభావం ఏర్పడి అది అంతులేని ఆవేదనకు,ఆందోళనకు దారితీసి అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.వీర్యహీనతవల్ల పిక్కలు,తొడలు,నడుములు,వెన్ను,గుండె బలహీనపడి ఆకలి,అరుగుదల తగ్గిపోయి,బలవంతంగానైనా రతిలో పాల్గొనాలని ప్రయత్నించి మాటి మాటికి మరింత విఫలమౌతూ మానసిక వ్యాధిగ్రస్తుడిగా మారి మంచానపడతాడు.ఈ ఒకేఒక లోపం వల్ల అతనిలో అంతకు ముందున్న చురుకుదనం, తెలివితేటలు,ధైర్యసాహసాలు,దీక్షాదక్షతలు అన్నీ కనుమరుగైపోయి వృత్తిలో కూడా రాణించలేక విఫలమౌతాడు.

పాలు తాగితేనే-పురుషుల్లో శక్తి వస్తుందా?

సృష్టిలోని ప్రాణశక్తిగల అనేక పదార్ధాల్లో పాలు అనేవి యోగవాహిక శక్తి కలిగివుంటాయి.అంటే సేవించిన క్షణంలోనే జఠరాగ్నితో కలిసి పచనమై సప్తధాతువులుగా రూపాంతరం చెంది వీర్యానికి శక్తికి దృఢత్వాన్ని అందివ్వగలుగుతాయి.ఇలాంటి ప్రాణపదార్ధాలనే యోగవాహికశక్తులంటారు.

అందుకే సంభొగానికి ముందు ఒకసారి,సంభోగం తరువాత ఒకసారి పాలు సేవించాలని దానివల్ల పురుషుడికి వీర్యహీనత కలుగకుండా బలహీనత రాకుండా ఉంటుందని మహర్షులు అనుభవపూర్వకంగా నిర్ధారించి చెప్పారు.కాబట్టి వీర్యబలం కోసం తాత్కాలిక ప్రేరణ కలిగించే ఔషధాలు వాడుతూ శాశ్వత నపున్సకత్వాన్ని పొందకుండా శాశ్వత పురుషత్వాన్ని కలిగించే మంచిపాలు సేవిస్తూ ధర్మపధంలో జీవించుదురుగాక!