టీనేజ్ లో శృంగార కోరికలకు కారణం!

0

Teenagers--romanceటీనేజ్ యువతీ యువకులలో వయస్సు పెరిగేకొద్దీ, వారిలో కామవాంఛలు కూడా ఎక్కువగానే పెరుగుతుంటాయట! తమలో ఏర్పడే సెక్స్ కోరికలను నిగ్రహించుకోలేని టీనేజర్లు పక్కదార్లు తొక్కుతారని సెక్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇందుకోసం విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయటం లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

టీనేజ్ లో శృంగారాన్ని సవ్యంగా అనుభవించని వారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మోడ్రన్ యూత్ తమ సెక్సువల్ కోరికలు తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతూ ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు ఈ సర్వేలు చెబుతున్నాయి.

అందుకోసం ఎక్కువ డబ్బు సంపాదించేందుకు, ఎక్కువ కష్టపడేందుకు సైతం వారు సిద్ధమవుతున్నారట! అసలు శృంగారం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న తపన కారణంగానే టీనేజర్లు కోరికలు తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరట. ఆ తపన వల్లే అమ్మాయితో అబ్బాయి, అబ్బాయితో అమ్మాయి సంబంధాలు పెంచుకోవడానికీ, ఆ తరువాత ప్రేమలో మునిగి తేలేందుకూ ప్రయత్నిస్తారట! వీరిలా ప్రయత్నించడానికి ఇంకా 237 ఇతర కారణాలున్నట్లు సెక్స్ నిపుణులు చెబుతున్నారు.

టీనేజ్ లోనే శృంగార అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమని సర్వే చెబుతోంది. ఈమధ్యనే ఐర్లాండ్ లో ఎనిమిది నుంచి 18 ఏళ్ల వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి.

ఐర్లాండ్ లో 230 స్కూళ్లలో 13,500 మంది విద్యార్థులపై హెల్త్ సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు చాలామంది ఇప్పటికే తమకు శృంగార అనుభవాలు ఉన్నట్లు చెప్పారట. అందులోనూ పేద, మధ్యతరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.