భార్య నుంచి భర్త ఎక్స్ పెక్ట్ చేయకూడని విషయాలు!

0couples-picపెళ్లి అయింది అంటే మగవాళ్లు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ముఖ్యంగా భార్య విషయంలో.. మగవాళ్లకు ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చాలామంది భర్తలు భార్యల నుంచి చాలా అవాస్తవైన విషయాలను కోరుకుంటారు.

సాధారణంగా మహిళల నుంచి మగవాళ్లు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ.. రిలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత.. అబ్బాయిల ఆలోచనలు మారుతాయి. భార్య నుంచి ఎక్స్ పెక్ట్ చేసినవి జరగకపోతే.. చాలా ఢీలాపడిపోతారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలవుతాయి.

కాబట్టి పెళ్లైన తర్వాత భార్యల నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. కానీ అంచనాలు మరీ మించిపోకూడదు. కొన్ని సందర్భాల్లో చాలా అవాస్తవమైన అంచనాలు కలిగి ఉంటారు. అసలు మగవాళ్లు మహిళల నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అవాస్తవమైన అంశాలేంటో చూద్దాం..

ఎప్పుడూ అందంగా కనిపించాలని

కొంతమంది మగవాళ్లు తమ భార్య ఎల్లప్పుడూ చాలా అందంగా కనిపించాలని భావిస్తారు. మీ భార్య వంట చేయాలి, ఇంటి పనిచేయాలి అని మీరు ఎక్స్ పెక్ట్ చేసినప్పుడు.. ఆమె ఎప్పుడు చూసినా అందంగా కనిపించాలి అనుకోవడం సరైనది కాదు.

అమ్మలాగే భార్య వండిపెట్టాలని

కొంతమంది అబ్బాయిలు వాళ్ల అమ్మలాగే భార్య కూడా ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తారు. మీ భార్యను, మీ అమ్మతో పోల్చడం సరైన పద్ధతి కాదు. మీ అమ్మలాగా వండిపెట్టాలని కోరుకోవడం చాలా అవాస్తవైన అంచనా.

అమ్మ చెప్పినట్టే చేయాలని

మీ భార్య మీ అమ్మ చెప్పినట్టు వినాలని, మీ అమ్మకు విధేయురాలిగా ఉండాలని ఎక్స్ పెక్ట్ చేయడం సరికాదు. మీ భార్య సౌకర్యంగా ఫీలవకుండానే మీ తల్లి దగ్గర సలహాలు, సూచనలు తీసుకోలేదు. ఇది చాలా అవాస్తవైన అంచనా.

మోడ్రన్ గా, ట్రెడిషనల్ గా

కొంతమంది అబ్బాయిలు తమ భార్య బయటకు వెళ్తే.. చాలా మోడ్రన్ గా, ఇంట్లో ఉంటే.. చాలా ట్రెడిషనల్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్లకు కూడా.. కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. అలా ఫోర్స్ చేయడం మంచిది కాదు.

ఫిట్ గా ఉండాలని

ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని భార్య నుంచి భర్త కోరుకోవడం. వయసు పెరగడం, శరీరంలో మార్పులు, ప్రెగ్నన్సీ కారణాల వల్ల మహిళల శరీరంలో మార్పులు వస్తాయి. ఫిట్ నెస్, అందం తగ్గుతుంది. కాబట్టి మహిళ నుంచి ఫిట్ గా ఉండాలని ఎక్స్ పెక్ట్ చేయడం సరైనది కాదు.