మగవాళ్ళ చూపు అక్కడే ఎందుకో తెలుసా?

0

Sherlyn Chopraఆడవాళ్ళలో మగవాళ్ళు మొదట గమనించేది ముఖం, ఆ తర్వాతా వక్షోజాలనే. బ్రెస్ట్ అంటే మగవాళ్ళకి పిచ్చి. ఎంత వద్దనుకున్నా మగవాళ్ళ తమ చూపులతో ఒక్కసారైనా అక్కడ తడిమేస్తారు. మగాళ్ళు ఎందుకు తమ బ్రెస్ట్ వైపు అలా చూస్తారు అనే ప్రశ్న ఆడవాళ్ళ మనసుని తొలిచేస్తుంటుంది. మగవాళ్ళకి అలా వక్షోజాలు ఉండవు కాబట్టి, వాళ్ళు వాటినే చూస్తున్నారని చాలామంది అనుకుంటుంటారు. అయితే, మగవాళ్ళు ఆడవాళ్ళ బ్రెస్ట్ ని ఆసక్తిగా చూడడం వెనుక పెద్ద శాస్త్రీయ కారణమే ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. లారి యంగ్ అనే న్యూరో సైంటిస్ట్ ఈ అంశం పైపరిశోధన చేసాడు. ఆయన కనుగొన్నదేమిటంటే…

మొత్తం సృష్టిలో మానవులు మాత్రమే వక్షోజాల ద్వారా సెక్స్ స్టిములేషణ్ పొందుతారట. సృష్టిలో మరే క్షీరదంలో కూడా వక్షోజాలకి సెక్స్ కి సంబంధం లేదట. మనుషుల్లో మాత్రమె గర్భం తో సంబంధం లేకుండా, ఒక వయసు రాగానే వక్షోజాలు పెరుగుతాయి. మిగతా జీవుల్లో, గర్భం దాల్చాక వక్షోజాలు పెరుగుతాయి. సృష్టిలో మరే జీవికూడా సెక్స్ కి ముందు వక్షోజాలని స్పృశించడం, స్టిములేట్ చేయడం ఉండదని ఈయన చెబుతున్నారు.

తల్లీ బిడ్డలమధ్య, భార్యాభర్తల మధ్య అనుబంధానికి సంబంధించిన న్యూరో సర్క్యూట్ మెదడులో ఒకటే ఉంటుందట. అంటే ఈ రెండు అనుబంధాలని ఒకే న్యూరో సర్క్యూట్ నియంత్రిస్తుందట. అందువల్ల బిడ్డ గా ఉన్నప్పుడు ఎలా అయితే స్తనాలు అంటే ఇష్టపడతాడో ,పెద్దయ్యాక కూడా అదే ఇష్టం కొనసాగుతుందట.

బిడ్డ తల్లిదగ్గర పలు తాగుతున్నప్పుడు, లవ్ డ్రగ్ అని పిలిచే ఒక రసాయనం (ఆక్సిటోసిన్) తల్లి మెదడులో విడుదల అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ విడుదల కావడం వల్ల, తల్లి మనసంతా బిడ్డ మీద కేంద్రీకరించబడుతుంది. వక్షోజాల కొనలని స్పృశించినప్పుడు మెదడులో ఏ భాగం స్పందిస్తుందో, యోని దగ్గర స్పృశించినప్పుడు కూడా అదే మెదడు భాగం స్పందిస్తుందట. అందుకే వక్షోజలని ముట్టుకుంటే స్త్రీలలో లైంగిక భావనలు కలుగుతాయని ఈ శాస్త్రవేత్త చెబుతున్నారు. అందుకే స్త్రీని సెక్స్ కి సిద్ధం చెయ్యాలంటే పురుషులు వక్షోజాల నుండే పని మొదలుపెడతారు. అనాదిగా ఇలా కొనసాగుతుండటం వల్ల మగవారికి, స్త్రీల వక్షోజాలు అంటే అంత ఆసక్తి ఏర్పడింది అని ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు.