Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> క్యాన్సర్ వ్యాధిని నివారించే మార్గాలు

క్యాన్సర్ వ్యాధిని నివారించే మార్గాలు


క్యాన్సర్ వ్యాధి తగ్గించటానికి చేయవలసిన పనులు కాకుండా వివిధ రకాల పనులు చేస్తుంటారు. ఇక్కడ తెలిపిన వాటిని అనుసరించటం వలన మీరు సరైన పద్దతులలో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించవచ్చు.
1ఆహారం యొక్క శక్తి
ఆహరంలో ఉండే మూలకాలు క్యాన్సర్ వ్యాధి కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి మరియు క్యాన్సర్ కారకాలను నశింపచేస్తాయి. కావున ఆరోగ్యకరమైన ఆహరాన్ని తీసుకుంటూ, రోగ కారకాల నుండి దూరంగా ఉండాలి. క్యాన్సర్’ను నివారించే పద్దతులు ఇక్కడ తెలుపబడ్డాయి.

2రోజు వ్యాయామాలు చేయండి
క్యాన్సర్ వ్యాధి తగ్గించటానికి, బరువు తగ్గించటానికి వ్యాయామాలు తప్పకుండా అవసరం. రోజు వ్యాయామాలు చేయటం వలన స్థూలకాయత్వ భారీ నుండి కాపాడుకోవచ్చు. స్థూలకాయత్వం వలన క్యాన్సర్ కలిగే ప్రమాదం, క్యాన్సర్ వ్యాధి అధికం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రోజు 30 నిమిషాల పాటు భౌతిక కార్యకలపాలు చేయటం మరవకండి.

3వంటలను సాంప్రదాయబద్దంగా చేయండి
ఫ్రై చేసిన ఆహారాలు మరియు మైక్రోవేవింగ్ ఆహారాలను మితిమీరిన స్థాయిలో తీసుకోవటం లేదా పూర్తిగా దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉడికించిన, ఆవిరిలతో చేసిన వంటి వాటిని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. తాజాగా వండిన ఆహారాన్ని తినండి, తిరిగి వేడి చేసిన లేదా ఫ్రిజ్’లో పెట్టిన ఆహారాలను తినకండి.

4ఫైబర్ తినటం అధికం చేయండి
ఫైబర్ అధికంగా ఉన్న మాంసం, ఫ్లాక్స్ మరియు నట్స్’లను రోజు తినటం వలన క్యాన్సర్ పెరగటాన్ని తగ్గిస్తాయి. రోజులో 35 గ్రాముల ఫైబర్ తీసుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

5రెడ్ మీట్’కి దూరంగా ఉండండి
‘నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వారు అమెరికన్ జర్నల్స్ ఆఫ్ ఏపీడేమాలజీ’ అనే దానిలో అధిక మొత్తంలో ఎరుపు మాంసం లేదా రెడ్ మీట్’ను తీసుకోవటం వలన క్యాన్సర్ 12 శాతం పెరుగుతుంది అని ప్రచురించారు. మరొక సంస్థ ప్రచురించిన దాని ప్రకారం ఎవరైతే రెడ్ మీట్’ను అధికంగా తీసుకుంటారో వారిలో, రెడ్ మీట్ తినని వారితో పోలిస్తే, రెడ్ మీట్ తినే వారిలో క్యాన్సర్ రావటానికి అధికంగా అవకాశాలు ఉంటాయి అని ప్రచురించారు.

6చక్కర మరియు ఉప్పు తీసుకోవటం తగ్గించండి
చక్కర మరియు ఉప్పు స్థాయిలు అధికంగా తీసుకోవటం వలన అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడతాయి, ఇది క్యాన్సర్ అధికం అవటాన్ని ప్రేరేపిస్తుంది. షుగర్ స్నాక్స్ మరియు ద్రావణాలకు తప్పకుండా దూరంగా ఉండాలి. అంతేకాకుండా వీటిలో ఫైబర్ స్థాయిలు తక్కువగా ఉండి శరీరానికి కావలసిన పోషకాలను అందించలేవు.

7సిగరెట్ మరియు మద్యపానానికి దూరంగా ఉండండి
పొగత్రాగక పోవటం వలన క్యాన్సర్ రావటానికి దూరంగా ఉండవచ్చు. రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవటం అనగా పురుషులలో ఒకటి లేదా రెండు పెగ్గులు, ఆడవారు ఒక పెగ్గు తీసుకోవటం వలన ఆరోగ్యానికి హాని కలుగదు అని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

8కొవ్వును పెంచే పదార్థాలకు దూరంగా ఉండండి
అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలను తీసుకోవటం తగ్గించండి. రోజు 30 శాతం కన్నా తక్కువ క్యాలోరీలను తీసుకోండి. అతిగా సాచురేటేడ్ ఫాట్’లు తీసుకోవటం కన్నా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం చాలా మంచిది.