Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> క్యాన్సర్ నివారణ కోసం కాలీఫ్లవర్’ను ఎందుకు వాడతారు?

క్యాన్సర్ నివారణ కోసం కాలీఫ్లవర్’ను ఎందుకు వాడతారు?


ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు క్యాన్సర్ భాదితులకు కాలీఫ్లవర్ ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు వాటికి గల కారణాలు, కాలీఫ్లవర్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుఅపబడింది.
1కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ చాలా రకాల పోషకాలను కలిగి ఉన్నందు వలన ముఖ్యమైన ఆహరంగా చెప్పవచ్చు. కాలీఫ్లవర్’లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్’లు, విటమిన్ ‘C’ మరియు నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచే కారకాలను కలిగి ఉండి, క్యాన్సర్’కు వ్యతిరేఖంగా పనిచేసే ‘ఫోలేట్’ మూలకాలని కలిగి ఉంటుంది. అందువలనే వైద్యులు, ఆరోగ్య నిపుసులు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను కాలీఫ్లవర్’ను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు.

2విటమిన్ ‘C’
విటమిన్ ‘C’ అనేది శక్తివంతమైన మరియు శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్ వలన కణాలలో, శరీరంలో జరిగే ప్రమాదాలను విటమిన్ ‘C’ నివారిస్తుంది. వండిన సగం కప్పు కాలీఫ్లవర్’లో దాదాపు 27.6 మిల్లి గ్రాముల విటమిన్ ‘C’ని పొందవచ్చు.

3ఫోలేట్
వండిన సగం కప్పు కాలీఫ్లవర్’లో సుమారు 28 మైక్రో గ్రాముల ఫోలేట్’లు ఉంటాయి. శరీరంలో కణాల ఉండే జన్యుపదార్ధం అయినట్టి DNA, ఫోలేట్’తో తయారు చేయబడుతుంది మరియు వివిధ రకాల క్యాన్సర్’లను పెరుగుదలను నియంత్రించుటలో సహాయపడుతుంది.

4ఇండోల్-3-కార్బినోల్
పరిశోధనల ప్రకారం కాలీఫ్లవర్ ఫైటోకెమికల్’లను కలిగి ఉంటుంది వీటిని ఇండోల్-3-కార్బినోల్ అంటారు. ఈ ఫైటోకెమికల్’లు ఈస్ట్రోజేన్’లను విచ్చిన్నం చెందించి, రొమ్ము క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్’లను తగ్గిస్తుంది.

5కోలన్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్
కాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్లూకోరపిన్’ను కలిగి ఉండి, జీర్ణాశయ లోపలి గోడలను క్యాన్సర్ కారకాల నుండి మరియు ఇతర హానికర కారకాల నుండి కాపాడుతుంది.

6ప్రోస్టేట్ క్యాన్సర్ లేదా పౌరుష గ్రంది క్యాన్సర్
కాలీఫ్లవర్ వలన మరొక ఉపయోగం పౌరుష గ్రంధి చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్’లను తొలగించి మరియు రక్త సరఫరాను పెంచుతుంది. కాలీఫ్లవర్’లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్’లు శరీరంలో క్యాన్సర్ కలుగచేసే క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి.

7రొమ్ము క్యాన్సర్
కాలీఫ్లవర్’ను ఆహరంలో ఒక భాగంగా చేసుకోవటం వలన రొమ్ము క్యాన్సర్’ను కలుగనివ్వదు, ఇందులో ఉండే ఫైటో-కెమికల్ అయినట్టి ‘సల్ఫోరఫెన్’, ‘ప్లాంట్ స్టేరాల్’ మరియు ‘ఇండోల్-3-కార్బినోల్’ వంటివి ఉండటం వలన ఇవి క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకొని వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి.

8గర్భాశయ క్యాన్సర్
కాలీఫ్లవర్ క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పనిచేసె ఆరోగ్యకరమైన ఆహరం ముఖ్యంగా ఆడవారిలో ఇది వివిధ రకాల క్యాన్సర్’లను రాకుండా చూస్తుంది. కాలీఫ్లవర్ ముఖ్యంగా క్యాన్సర్ పెరుగుదలను నిరోధించే ‘ఫైటో-కెమికల్’లను, ‘ప్లాంట్ స్టేరాల్’లను, యాంటీ-ఆక్సిడెంట్’లను, విటమిన్ ‘C’ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి గర్భాశయ క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయని పరిశోధనలలో వెల్లడయింది.

9అండాశయ క్యాన్సర్
పిల్లలు లేని ఆడవారిలో, హార్మోన్ బదిలీ చికిత్స చేపించుకొన్న వారిలో, రొమ్ము క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ మారియు అండం ఫలదీకరణ చెందుటకు మందులను వాడే వారిలో అండాశయ క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. ఈ అండాశయ క్యాన్సర్ కలిగిన వెంటనే లక్షణాలు బహిర్గతం అవవు. కానీ కాలీఫ్లవర్’ను రోజు తినటం వలన అండాశయ క్యాన్సర్ పెరుగుదల నియంత్రించబడుతుంది.

10పిత్తాశయ క్యాన్సర్
‘ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ క్యాన్సర్’ పరిశోధనల ప్రకారం, కాలీఫ్లవర్ తినే వారిలో మరియు ఎక్కువ కూరగాయలను తినే వారిలో పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 29 శాతం తగ్గుతుంది అని తెలిపారు. పిత్తాశయ క్యాన్సర్ కూరగాయలు తక్కువ తినే వారిలో గమనించవచ్చు.