Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఒక ముద్దు.. 24 ప్రయోజనాలు!

ఒక ముద్దు.. 24 ప్రయోజనాలు!


ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఈ ముద్దులు బాలీవుడ్‌ నుంచి క్రమేనా టాలీవుడ్‌కు పాకాయి. దీంతో ముద్దులు చూసి ‘ఛీ.. పాడు’ అనే రోజులు పోయి, వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ముద్దు.. చూసేందుకే ‘ఛీ పాడు’. కానీ, ఆ ముద్దులను ఆశ్వాదించేవారికి మాత్రం అది ఆయుష్సు పోసే సంజీవని. మరి, ముద్దు వెనుక ఉన్న 24 ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా!

1. ప్రేమను బలపరిచే శక్తి ముద్దుకు మాత్రమే ఉంది. ఒక ముద్దు స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. 
2. ఒక ముద్దు వల్ల ముఖంలోని 34 కండరాలతోపాటు 112 పోస్ట్రల్ కండరాలు ఉత్తేజితం అవుతాయి. త 
3. గుండె పనితీరును మెరుగుపరిచేందుకు, గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దు ఖతర్నాక్‌గా పనిచేస్తుంది. 
4. ముద్దు పెట్టుకునేవారిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుంది. 
5. శరీర మెటబాలిక్ రేట్ పెరిగి బరువు తగ్గుతుంది.

6. అదర చుంబనం వల్ల దంతాలు తెల్లగా మిలమిల్లాడతాయి. 

7. ముద్దు పెట్టుకునే సమయంలో ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) దంతాలను సంరక్షిస్తుంది. దంత క్షయం దూరమవుతుంది.
8. ముద్దు.. ఒత్తిడి, ఆందోళన, ఆతురత నుంచి దూరం చేస్తుంది.
9. ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
10. ముద్దు వల్ల మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం జరిగి, వాటికి మంచి షేప్ వస్తుంది.
11. ముద్దు రక్తపోటును నియంత్రిస్తుంది.
12. ముద్దు పెట్టుకునే సమయంలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనం నొప్పులను నియంత్రిస్తుంది.

13. ముద్దు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన, ఆతురత వంటివి క్రమంగా దూరమవుతాయట.
14. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ రసాయనాల వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.
15. ముద్దు తలనొప్పిని సైతం మాయం చేస్తుంది.
16. రోజూ యాపిల్ తింటే వైద్యుడితో పని ఉండదని అంటారు. ఇది ముద్దుకు కూడా వర్తిస్తుంది.
17. ముద్దు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎపినెఫ్రిన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగుపడుతుంది.
18. ముద్దు వలన ప్రేమే కాదు.. బ్యాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఒక భాగస్వామి నుంచి మరొకరికి బాక్టీరియా బదిలీ కావడం వల్ల ఇరువురిలో రోగ నిరోధక శక్తి మెరుగువుతుంది.

19. ముద్దు పెట్టుకునే ప్రక్రియలో ఇమ్యునోగోబ్లిన్ A (IgA) విడుదలవుతుంది.
20. ముద్దు సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్‌లు మిమ్మల్ని సంతోషం ఉంచేందుకు దోహదం చేస్తాయి.
21. ముద్దు వల్ల విడుదలయ్యే మైక్రోబయోమ్‌లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి.. ప్రమాదకర సూక్ష్యజీవులు, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.
22. ఒక్క నిమిషం ముద్దు పెట్టుకుంటే సుమారు రెండు కిలోరీలు ఖర్చవుతాయని యూనివర్శిటీ ఆఫ్ లూస్‌విల్లే స్టడీ పేర్కొంది.
23. మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఒక ముద్దులో లభిస్తాయి.
24. చివరిగా.. ముద్దు మీ సెక్స్ ‌లైఫ్‌కు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. సెక్స్ చేస్తుండగానే కొంతమందికి అంగం మెత్తబడుతుంది. అలా జరగకూడదంటే.. ముద్దు పెడుతూ సెక్స్ చేయడం ఉత్తమం అని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి.. మీ ముద్దులను ‘కిస్సింగ్ డే’కు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం కొనసాగించి ఆరోగ్యంగా ఉండండి.