Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ప్రేగ్నేన్సి సమయంలో కలిగే సాదారణ అసౌకర్యాలు

ప్రేగ్నేన్సి సమయంలో కలిగే సాదారణ అసౌకర్యాలు


ప్రేగ్నేన్సి సమయంలో సహజంగానే శరీరంలో చాల మార్పూలు సంభవిస్తాయి. వీటికి తోడు వివిధ రకమైన ఆనర్గోగ్యాలు, అసౌకర్యాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. కొన్ని సహజంగా కలిగే అసౌకర్యాలను గురించి అవగాహనా కలిగి ఉండడం వలన వాటిని ఎలా ఎదుర్కోవడం సులువు అవుతుంది.
1వికారం, వాంతి
దాదాపుగా 70% మహిళలు తేలికపాటి నుండి సాదారణ స్థాయి వికారం, వాంతి సమస్యలను ఎదురుకుంటారు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో ఇది ఎక్కేవగా ఉంటుంది. దిన్ని ‘మార్నింగ్ సిక్నెస్” అంటారు, కాని ఇది రోజంత ఉంటుంది. చిన్న మొత్తంలో రెగ్యులర్ గ తినటం ద్వార దిన్ని అరికట్టవచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినడం మరియు ఎక్కువ సేపు కడుపు కాలిగా ఉండకొండ చూసుకోవడం తో కూడా దిన్ని నియంత్రిచవచ్చు.

2మలబద్ధకం
గర్బసమయంలో సాదారణంగానే మలబద్ధకం తలెత్తుతుంది. ప్రోగేస్తేరోన్ అని ఎంజైమ్ అధికంగా విడుదల అవ్వడం వలన డైజేస్టివ్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి. దీనితో ఆహారం చిన్న ప్రేగు గుండా చాల నిదానంగ జరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మరియు అధిక మొత్తంలో ఫ్లుయిడ్స్ తీసుకోవడం ద్వారా దిన్ని అధిగమించవచ్చు.

3అలసట
పిల్లలను కనడం అంత తేలికైన సంగతేం కాదు. గర్భం శక్తిని, బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ని పిల్చేసి ఒక రకమైన అలసట కి గురిచేస్తుంది. ఈ అలసట నిత్యంగా ఉన్న భావన కలిగేల చేస్తుంది. సరిగా పౌష్టికాహారం తినడం మరియు గోరువెచట్టి నీళ్ళతో స్నానం చేయడం వలన పునర్జ్జివనం కలిగిన భావన కలుగుతుంది.

4తిమ్మిరి
ప్రేగ్నేన్సి సమయం లో అత్యంత సహజంగా కలిగే మరొక సమస్య తిమ్మిర్లు, ప్రత్యేకంగా కాళ్ళలో తిమ్మిర్లు. కడుపులోని బిడ్డ వాళ్ళ, తద్వారా పెరిగిన బరువు తో మోకాళ్ళపై అదిక బారం పడుతుంది. దీనితో తిమ్మిర్లు సంభవిస్తాయి. అధికంగా కాల్షియం ఉన్న ఆహారాలు లేదా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వార దిన్ని అధిగమించవచ్చు.