Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> సూర్యరశ్మి వలన కందిన చర్మాన్ని సరిచేసే ఆపిల్ సైడర్ వెనిగర్

సూర్యరశ్మి వలన కందిన చర్మాన్ని సరిచేసే ఆపిల్ సైడర్ వెనిగర్


సూర్యకాంతి వలన కలిగే చర్మ సమస్యలు ముఖ్యంగా వేసివికాలంలో చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి, చికాకులకు మరియు సమస్యలకు గురి చేస్తాయి. బీచ్ లేదా సముద్ర తీరంలో స్నానం, స్విమ్మింగ్ లేదా తరచుగా, ఎక్కువ సమయం ఎండల ఉండటం వలన చర్మం కంది పోతుంది. ఈ రకమైన సమస్యల నుండి ఉపశమనం పొందుటకు రసాయనిక క్రీములతో చికిత్స చర్మాన్ని ఆలర్జీలకు గురిచేసి, ముఖ్యంగా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు గురి చేస్తుంది. అందువలన, ఇలాంటి ఖరీదు గల చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సూర్యరశ్మి వలన కందిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

సూర్యరశ్మిలో చర్మం ఎలా కందుతుంది?
సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో, అతినీలలోహిత కిరణాల వలన చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం, ఇది చర్మ, వెంట్రుకల మరియు కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో, మెలనిన్ సరిపోయేంత స్థాయిలో, వేగంగా ఉత్పత్తి చేయబడదు. ఫలితంగా, చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది.

ఫలితంగా ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదం నుండి ఉపశమనం పొందుటకు ఇన్ఫ్లమేషన్ లకు గురవుతాయి. మరోవైపు, శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సార్లు ఈ రెండు పద్దతుల మధ్య సమతుల్యత లేని ఎడల చర్మ క్యాన్సర్ కలిగే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం మరియు మీ చర్మ ధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది. ఒకవేళ మీ చర్మ ధోరణి తెలుపుగా ఉంటే, మధ్యాన్న సమయంలో కేవలం 15 నిమిషాల పాటు భయట ఉండటం వలన చర్మం కందిపోతుంది. దీర్ఘకాలిక సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతమవటం వలన చర్మంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి, చర్మంపై ఎరుపుదనాన్ని ఏర్పరుస్తాయి. ఎలా జరిగిన తరువాత అదే రోజున చర్మం కందిన లక్షణాలు బహిర్గతమవవు. చర్మం కందిన24 గంటల తరువాత లక్షణాలు బహిర్గతమవుతాయి మరియు 3 నుండి 5 రోజులలో ఈ స్థితిని మెరుగుపరచవచ్చు.

సూర్యరశ్మి వలన కందిన చర్మానికి వెనిగర్ వాడకం
సూర్యకాంతి వలన కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సరి చేయవచ్చు మరియు దీని వలన చర్మ కణాలలో కలిగిన ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వెనిగర్ వాడకం గురించి కింద తెలుపబడింది.
స్ప్రే బాటిల్ లో కొద్దిగా వెనిగర్ ను తీసుకొని, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రభావిత ప్రాంతాలలో స్ప్రే చేయండి.
శుభ్రమైన గుడ్డను వెనిగర్ లో ముంచండి, ఈ గుడ్డతో చర్మంపై తుడవండి.
డైల్యూటేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్నానం చేయండి.
ఇలా చేయటం వలన సూర్యకాంతి వలన ప్రమాదానికి గురైన చర్మం కొద్ది సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందటం మీరు గమనిస్తారు.

కావున, సుర్యకాంతి వలన మారిన చర్మ రంగును తొలగించుటకు గానూ రసాయనిక క్రీములకు బదులుగా ఇంట్లో ఉండే ఔషదాలను వాడండి. వీటితో పాటుగా రోజులో ఎక్కువ సమయం పాటూ సూర్యకాంతిలో తిరగకండి మరియు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.